CPM | మెట్రో రైలు బోగిల సంఖ్యను పెంచండి ..హైదరాబాద్ మెట్రో రైల్ జీఎంను కోరిన సీపీఎం
ప్రయాణికుల రద్ధీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైలు బోగిల సంఖ్యను మూడు నుంచి ఆరు వరకు పెంచాలని మెట్రో జనరల్ మేనేజర్ ఎన్. రాజేశ్వర్‌ను కలిసి సీపీఎం నగర కమిటీ వినతి పత్రం అందించింది.

విధాత, హైదరాబాద్ : ప్రయాణికుల రద్ధీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైలు బోగిల సంఖ్యను మూడు నుంచి ఆరు వరకు పెంచాలని మెట్రో జనరల్ మేనేజర్ ఎన్. రాజేశ్వర్‌ను కలిసి సీపీఎం నగర కమిటీ వినతి పత్రం అందించింది. ఇప్పుడు మెట్రో రైలు మూడు బోగిలతో మాత్రమే నడుస్తుందని, దీంతో వేయి మంది ప్రయాణించే స్థానంలో రెట్టింపు సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తూ ఇబ్బంది పడుతున్నారని వినతి పత్రంలో సీపీఎం పేర్కోంది. బ్లూలైన్, రెడ్ లైన్‌లలో పీక్ టైంలో రైలు ఎక్కడం దిగడం కూడా కష్టంగా మారిందని, రైలు లోపల నిలబడే పరిస్థితి కూడా ఉండటం లేదని, ప్రతి రోజు 5లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, బోగిలు పెంచితే 10లక్షల మంది ప్రయాణిస్తారని తెలిపారు. నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ రద్ధీ, పెరిగిన జనాభా మేరకు ప్రజారవాణా లేదని, అందుకే మెట్రో రైలు బోగిలు మూడు నుంచి ఆరుకు పెంచాల్సిన అవసరముందన్నారు. దీనిపై ప్రభుత్వం, మెట్రో సంస్థలు సీరియస్‌గా పరిశీలించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై చొరవ తీసుకుని, మెట్రో రైలు పొడిగించి ప్రజా రవాణ వసతి పెంపొందించాలని సీపీఎం నగర కమిటీ కోరుతుందన్నారు. మెట్రో రైలు బోగిల పొడిగింపుపై ఈ ఆగస్టు నెలంతా మేం ప్రజాఉద్యమం కొనసాగించనున్నామని సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, నాయకులు శ్రీనివాసరావు, ఎం.దశరథ్‌లు తెలిపారు.