Telangana Cabinet | కేబినేట్ భేటీకి ఎన్నికల సంఘం బ్రేక్
తెలంగాణ కేబినెట్ భేటీకి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతినివ్వలేదు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉంటుందని ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ప్రకటించింది.

విధాత: తెలంగాణ కేబినెట్ భేటీకి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతినివ్వలేదు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉంటుందని ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ప్రకటించింది. అయితే ఒక వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్, మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 27న ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల కోడ్ ముగియనుంది. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతినివ్వనందునా అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలుస్తుంది.