పొలం ఆక్రమించుకున్నారు … ఆవేదనతో పురుగుమందుల తాగి రైతు ఆత్మహత్య
తన పొలాన్నికొందరు ఆక్రమించుకున్నారని.. అధికారుల చుట్టు తిరిగిన న్యాయం దక్కలేదని ఇక నాకు చావే శరణ్యమంటూ ఓ రైతు పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది
విధాత : తన పొలాన్నికొందరు ఆక్రమించుకున్నారని.. అధికారుల చుట్టు తిరిగిన న్యాయం దక్కలేదని ఇక నాకు చావే శరణ్యమంటూ ఓ రైతు పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని తహశీల్థార్, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసినా చర్యలు తీసుకోలేదని, కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో కలవలేదని, తనకు చావే శరణ్యమని ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోలో వాపోయాడు. రైతు తన కుటుంబానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు రాజ్యం రావాలని కాంగ్రెస్‌కు ఓటేశానని, తీరా తనకు అన్యాయం జరిగిందని..నేను చనిపోతున్నానని, నా ఆవేదనను సీఎం, డిప్యూటీ సీఎంలకు తెలియచేసి నా కుటుంబానికి న్యాయం చేయాలని వీడియోలో విజ్ఞప్తి చేశాడు. నా ఏడు ఎకరాల 10గుంటల్లో 3ఎకరాల పోలాన్ని ఆక్రమించి నాశనం చేసిన నిందితులు కూరపాటి కిషోర్, పెంటల రామారావు, గుర్రం నాగమల్లేశ్వర్‌రావు, మొగిలి శ్రీను, ముత్తయ్యలపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram