TELANGANA GOVT | టీమిండియా క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు

విధాత, హైదరాబాద్ : ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. జూబ్లీహిల్స్‌లోని వార్డు నెంబర్ 9, రోడ్ నెంబర్ 78లో సర్వే నెంబర్ 403పీలో 600గజాల స్థలం కేటాయించినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు, సిరాజ్‌కు ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రి మండలిలో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం తీసుకున్నారు. అయితే గతంలోనే జరీన్‌కు ఇంటి స్థలం కేటాయించి ఉండటంతో ఇప్పుడు సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయించారు.