విధాత, హైదరాబాద్ : డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు జులై 28వ తేదీకి వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు.. నోటిఫికేషన్ కు పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారని, ఈ నాలుగు నెలల వ్యవధిలో ఇతర అనేక పరీక్షలు రాశారన్నారు. సమయాభావం వల్ల పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని తెలిపారు. ఇక ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పది మంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని పేర్కొన్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి తగిన సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని కోర్టుకు వివరించారు. పిటిషన్ వేసిన పది మంది డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేశారా అని కోర్టు ప్రశ్నించింది. గ్రూప్ -1 తో పాటు డీఏవో, డీఎస్సీకి అప్లై చేశారని పిటిషనర్ల తరపున న్యాయవాది వెల్లడించగా, పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా మరో వైపు డీఎస్సీ పరీక్షలు గరువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
DSC | హైకోర్టులో డీఎస్సీ పరీక్ష పిటిషన్ విచారణ 28కి వాయిదా
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు జులై 28వ తేదీకి వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Latest News
పైపైకి.. బంగారం, వెండి ధరలు
సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు
వైరల్..చేతులపై నుంచి 100 కార్లు..శరీరంపై నుంచి 100 బైక్ లు !
ఆస్తులు దానం చేసింది నేను కాదు..అదంతా ఫేక్ న్యూస్ : సీపీఐ నేత నారాయణ
భారత్కు ఐఎండీ హెచ్చరిక.. ఎల్నినో అధికారికంగా ప్రారంభం!
హైదరాబాద్ లో కాక్రోచ్ ల ధర్నా
స్కాలర్షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
వైరల్.. నాగబంధం సినిమా అనంత పద్మనాభ స్వామి విగ్రహం
వైరల్ వీడియో..రోప్ జంపింగ్ లో మహిళ దుర్మరణం