Municipal Elections | మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
Municipal Elections | రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఛైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్ పదవుల కోసం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారికంగా ప్రకటించిన మున్సిపల్ శాఖ
Municipal Elections | విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఛైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్ పదవుల కోసం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలకు 50 శాతం కేటాయించారు. మొత్తం 121 మునిసిపాలిటీలలో 5 ఎస్టీలు, 17 ఎస్సీలు, 38 బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. దీంతో పాటు పది కార్పొరేషన్ మేయర్ పోస్టులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఏ వర్గాలకు రిజర్వేషన్ ఖరారు చేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ ఛైర్మన్లు
ఎస్టీ జనరల్‌కు కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, మహిళలు కేసముద్రం, ఎల్లంపేట
ఎస్సీ ఛైర్మన్లు
ఎస్సీ జనరల్‌లో స్టేషన్ ఘన్ పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్సెట్టిపేట, మూడు చింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్, ఎస్సీ మహిళ లో చొప్పదండి, హుజూరాబాద్, ఎదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేశం, చేర్యాల, వికారాబాద్, మోత్కూర్
బీసీ ఛైర్మన్లు
బీసీ జనరల్‌లో మద్దూరు, జనగాం, పెద్దపల్లి, భూపాలపల్లి, మంథని, ఐజ, వేములవాడ, వడ్డెపల్లి, షాద్ నగర్, అలంపూర్, జిన్నారం, బిచ్కుంద, జిన్నారం, జహీరాబాద్, గుమ్మడిదల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, సిద్దిపేట, హుజూర్ నగర్, తాండూర్
బీసీ మహిళకు యెల్లందు, దేవరకొండ, జగిత్యాల, కామారెడ్డి, బాన్సువాడ, కాగజ్ నగర్, దేవరకొండ, చెన్నూరు, మెదక్, ములుగు, కొల్లాపూర్, అచ్చంపేట, గజ్వేల్, దుబ్బాక, పరిగి, కొత్తకోట, ఆత్మకూరు, నర్సంపేట, ఆలేరు
జనరల్
జనరల్ అన్ రిజర్వుడ్‌లో పర్కాల, రాయికల్, మెట్ పల్లి, ఎల్లారెడ్డి, జడ్చర్ల, తొర్రూరు, చండూరు, నకిరేకల్, ఆలియా, కోస్గి, మక్తల్, ఖానాపూర్, భైంసా, బోధన్, సుల్తానాబాద్, శంకరపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, అమనగల్, కొత్తూరు, ఆందోల్ జోగిపేట, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, కొడంగల్, అమరచింత, పెబ్బేర్, వర్థన్నపేట, పోచంపల్లి, జనరల్ మహిళలకు అదిలాబాద్, అశ్వారావుపేట, కోరుట్ల, ధర్మపురి, గద్వాల్, సత్తుపల్లి, వైరా, మధిర, మరిపెడ, క్యాతన్ పల్లి, బెల్లంపల్లి, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, అలియాబాద్, కల్వకుర్తి, మిర్యాలగూడ, చిట్యాల, నారాయణపేట, నిర్మల్, భీమ్ గల్, ఆర్మూరు, సిరిసిల్ల, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, కోదాడ, వనపర్తి, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్.
10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఇవే
1. కొత్తగూడెం – ఎస్టీ జనరల్
2. రామగుండం – ఎస్సీ జనరల్
3. మహబూబ్‌నగర్ – బీసీ మహిళ
4. మంచిర్యాల – బీసీ జనరల్
5. కరీంనగర్ – బీసీ జనరల్
6. ఖమ్మం – మహిళా జనరల్
7. నిజామాబాద్ – మహిళా జనరల్
8. జీడబ్ల్యూఎంసీ – అన్ రిజర్వ్‌డ్
9. జీహెచ్ఎంసీ – మహిళా జనరల్
10. నల్లగొండ – మహిళా జనరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram