KTR | మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదు కేటీఆర్ ట్వీట్
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
విధాత : రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ట్విటర్ వేదికగా ఆయన ఈ ఘటనను ఖండించారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ? రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకని ప్రశ్నించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని, వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాంండ్ చేశారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram