Keshava Rao | ఇది ప్రజా ప్రభుత్వం..78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కేశవరావు
మెదక్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు(Independence Day Celebrations) ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్(Police Parade Ground)లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు హాజరయ్యారు.

అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే హామీల అమలు ప్రారంభం
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కేశవరావు
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు(Independence Day Celebrations) ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్(Police Parade Ground)లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్టనష్టాలకోర్చి, తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మహానీయులకు అంజలి ఘటించారు. అహింసను ఆయుధంగా(A weapon of non-violence) మలచుకొని దేశ స్వాతంత్య్రం సిద్ధించేందుకు కారకులైన జాతి పిత మహాత్మాగాంధీ(Father of Nation Mahatma Gandhi), దేశ ఉజ్వల భవిష్యత్తు కో సం రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానీయులను నేడు స్మరించుకోవడం మన విధి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం (People’s government)పనిచేస్తున్నదని కేకే చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముందున్నదన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని చెప్పారు. ఇందిరమ్మ గ్రామసభలు(Indiramma Gram Sabhas) నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించామన్నారు. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మహిళలు 1.07 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. దీని ద్వారా మహిళలకు రూ.35.70 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో అహర్నిశలు కృషి చేస్తున్న పొలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించి, అభివృద్ధి కోసం ఎల్లవేళల అంకిత భావంతో పనిచేస్తున్న గౌరవ ప్రజా ప్రతినిధులకు, జిల్లా యంత్రాంగానికి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి జిల్లా ప్రజలకు, స్వాతంత్య్ర సమర యోధులకు(To the freedom fighters), ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు తగు ప్రచారం కల్పించి ప్రజలలోకి తీసుకువెళుతున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులకు, అట్టడుగు వర్గాల దాక అభివృద్ధి ఫలాలను చేరవేసి ‘‘ప్రజా తెలంగాణ’’ అభివృద్ధికి సహకారం చేసే మా ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందిరికీ మరోమారు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగించారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, ఫైర్ ఇంజన్ ప్రదర్శన అలరించాయి. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా: మైనంపల్లి రోహిత్ రావు , జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, జిల్లాఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పీ మహేందర్, ప్రజలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మహిళలు, స్వాతంత్ర పోరాట యోధుల కుటుంబికులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలను కేశవరావు సన్మానించారు. ఉత్తమ సేవలందించిన పోలీస్, అధికారులకు సేవా పథకాలను అందించారు.