Raja Singh | బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్‌

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చి విషయాన్ని వెల్లడించడంతో పాటు

Raja Singh | బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్‌

సీఎం ఫోన్ నెంబర్ ఇచ్చానంటూ వెల్లడి

విధాత, హైదరాబాద్‌ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చి విషయాన్ని వెల్లడించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని తెలిపారు. నాకు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారని, ఇంకో నెంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాననని, ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే సీఎం నంబర్ ఇచ్చాననని చెప్పారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడని, ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదోనని సీఎం నెంబర్ ఇచ్చానని తెలిపారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోవడం లేదని, సీఎంకు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలన్నారు. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూడాలని వ్యాఖ్యానించారు. ఫోన్ చేసిన వారు పాలస్తీనాకు చెందిన వారిగా తెలుస్తోందని, ధర్మం కోసం నువ్ పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారని రాజాసింగ్ తెలిపారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై కేంద్ర హోంశాఖ అమిత్‌షాకు, డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.