సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు జడ్జీలు.. 34కు న్యాయమూర్తుల సంఖ్య

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయికి చేరుకున్నది. గురువారం ముగ్గురు వివిధ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతో, వారు ప్రమాణం స్వీకరించారు.
ఇది సుప్రీంకోర్టులో సీజేఐ సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందినవారిలో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టీన్ జార్జ్ మసై, గువాహటి హైకోర్టు సీజే జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు.
కాగా.. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం నవంబర్ 6న సిఫారసు చేసింది. వారిని నియమిస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్‌లో ప్రకటించారు. గతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానం పూర్తిస్థాయి సంఖ్యకు చేరుకున్నది.