పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత తీన్మార్ మల్లన్ననే ?

: వరంగల్‌ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌) విజేతగా నిలువనున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేత తీన్మార్ మల్లన్ననే ?

విధాత : వరంగల్‌ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌) విజేతగా నిలువనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా తీన్మార్ మల్లన్న గెలుపు కావలసిన కోటా ఓట్లు 1,55,095 ఓట్ల మార్కును అందుకునే దిశగా దూసుకుపోతున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా మొత్తం 52మంది అభ్యర్థులను ఒక్కోక్కరిగా ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 44మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు.

రెండో ప్రాధాన్యత ఓటుతో తేలనున్న ఫలితం

శుక్రవారం రాత్రి వరకు కూడా ఓట్ల లెక్కింపు సాగుతుంది. 44మందిని ఎలిమినేషన్ పిదప కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,873 ఓట్లు, బీఆరెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,990 ఓట్లు, బీజేపీ అభ్యర్తి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,797 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,948 ఓట్లు వచ్చాయి. గెలుపు మార్క్ కోటాకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 31,222 ఓట్లు, బీఆరెస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 50,105 ఓట్లు కావాల్సివుంది. అశోక్‌, ప్రేమేందర్‌రెడ్డిల ఎలిమినేషన్‌లతో ఫలితంపై స్పష్టత రానుంది.