TNGO | తెలంగాణ ఉద్యోగులను ఏపీ నుంచి వెనక్కు తీసుకువస్తున్న…సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీఓ
ఆంధ్రాలో పనిచేయుచున్న తెలంగాణ ఉద్యోగులు వెనక్కి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి టీఎన్జీవో కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ లు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు

తమ సమస్యలన్నీ సీఎంతో చర్చించి పరిష్కరించుకుంటాం: టీఎన్జీ ఓ
TNGO| ఆంధ్రాలో పనిచేయుచున్న తెలంగాణ ఉద్యోగులు వెనక్కి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి టీఎన్జీవో కేంద్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ లు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లో మంగళ, బుధవారాలలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగల సమాఖ్య (AISGEF) జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయని, ఈ సమావేశాలకు 24 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కామ్రేడ్ సుభాష్ లాంభ, ఏ శ్రీకుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు. దేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎదుర్కుంటున్న సమస్యలను సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు మార్గాలను నిర్దేశించారని పేర్కొన్నారు.
సీఎంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటాం టీఎన్జీఓ
జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో టీఎన్జీఓ తరపున పాల్గన్న తాము తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపామన్నారు. సీపీఎస్(CPS) రద్దు, పెండింగ్ లో ఉన్న డీఏ (DA) లను విడుదల, నూతన వేతన సవరణ, నూతన క్యాడర్ స్ట్రెంత్, ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం లాంటి అనేక సమస్యలు తెలంగాణ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చేసుకుంటామన్నారు.
దేశవ్యాప్తంగా వేతన జీవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వాస్తవ వివరాల ఆధారంగా ఆదాయం పన్ను పరిధిని పెంచడం, కంట్రీ బ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయడం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయడం లాంటి అనేక సమస్యలను సాధించుకోవడం కోసం దశలవారీగా ప్రభుత్వాలపై ఉద్యోగుల కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలియజేశారు.
AISGEF జాతీయ కార్యవర్గ సమావేశంలో టిఎన్జీఓ నుంచి అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు కొండల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి,ఉమాదేవి, మాధవి, శైలజ, నరసింహారెడ్డి, అనురాధ, సంతోష్ లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ్రభుత్వఉద్యోగుల డిమాండ్లు ఇవే…
1. CPS రద్దు చేసి OPS కొనసాగించాలి
2. పెండింగ్ D.A లను విడుదల చేయాలి
3. 5 సంవత్సరాలకు ఒక సారి వేతన సవరణ చేయాలి.
4. ఉద్యోగ, పెన్షనర్ల కు నగతూ రహిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి..
5. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాలీలను భర్తీ చేయాలి
6. కాంట్రాక్టు,అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి..ఇప్పటి వరకు పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి.
7. ఇన్కమ్ టాక్స్ పరిధిని 10 లక్షలకు పెంచాలి.
8. ప్రైవేటీకరణ అపాలి.
9.గ్రంధాలయం, మార్కెటింగ్ కమిటీ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు 010- ద్వారా వేతనాలు చెల్లించాలి.
10. నూతన జిల్లాలకు అదనపు కెడర్ స్ట్రెంత్ ను మంజూరు చేయాలి…