Traffic Restrictions | గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | గోల్కొండ బోనాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈ నెల 7వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14, 18, 21, 25, 28, ఆగస్టు 1, 4వ తేదీల్లో గోల్కొండలో బోనాల జాతర కొనసాగనుంది. ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
Traffic Restrictions | హైదరాబాద్ : గోల్కొండ బోనాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈ నెల 7వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14, 18, 21, 25, 28, ఆగస్టు 1, 4వ తేదీల్లో గోల్కొండలో బోనాల జాతర కొనసాగనుంది. ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.అంతేకాకుండా బోనాల జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పార్కింగ్ స్థలాలు ఇవే..
-మక్కై దర్వాజ మీదుగా గోల్కొండకు వచ్చే భక్తులు తమ ఫోర్ వీలర్ వాహనాలను రామ్‌దేవ్‌గూడ ఏఓసీ సెంటర్‌కు ఎదురుగా ఉన్న మిలటరీ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి. ద్విచక్ర వాహనాలను గోల్కొండ వాల్ పక్కనే ఉన్న ఆషూర్‌ఖాన వద్ద పార్క్ చేయాలి.
-ఫతేదర్వాజ మీదుగా గోల్కొండకు వచ్చే భక్తులు తమ ఫోర్ వీలర్ వాహనాలను అలంకార్ థియేటర్, దానికి ఆనుకుని ఉన్న ఓల్డ్ పెట్రోల్ పంప్ వద్ద పార్క్ చేయాలి. ద్విచక్రవాహనాలను హుడా పార్క్ వద్ద పార్క్ చేయాలి.
-సెవన్ టూంబ్స్ మీదుగా గోల్కొండకు వచ్చే భక్తులు తమ ద్విచక్ర వాహనాలను గోల్ఫ్ క్లబ్ పార్కింగ్‌లో, ఇతర వాహనాలను డెక్కన్ పార్క్ వద్ద పార్క్ చేయాలి.
-బోనాల జాతర కొనసాగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచా రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. కాబట్టి వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram