• Telugu News
  • /Telangana

Traffic Restrictions | నేటి నుంచి హైద‌రాబాద్ – ముంబై హైవేపై ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | ఈ నెల 24 నుంచి హైద‌రాబాద్ - ముంబై జాతీయ ర‌హ‌దారి(ఎన్‌హెచ్‌-65) పై ఉన్న నోవోపాన్ జంక్ష‌న్ వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు.

Reported by: raj | తెలంగాణ‌ | May 24, 2026, 10:10 am IST
Read Time: 3 mins
Traffic Restrictions | నేటి నుంచి హైద‌రాబాద్ – ముంబై హైవేపై ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | హైద‌రాబాద్ : ఈ నెల 24 నుంచి హైద‌రాబాద్ – ముంబై జాతీయ ర‌హ‌దారి(ఎన్‌హెచ్‌-65) పై ఉన్న నోవోపాన్ జంక్ష‌న్ వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు. జాతీయ ర‌హ‌దారిపై అండ‌ర్‌పాస్ నిర్మాణంలో భాగంగా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ఓఆర్ఆర్, సంగారెడ్డి నుంచి ప‌టాన్‌చెరు వైపు వెళ్లే వాహ‌న‌దారులు.. పోచారం క‌మాన్ వ‌ద్ద లెఫ్ట్ సైడ్ స‌ర్వీస్ రోడ్డులోకి వెళ్లాలి. అక్క‌డ్నుంచి నేరుగా ప‌టాన్‌చెరు వెజిట‌బుల్ మార్కెట్ రోడ్డుకు చేరుకోవ‌చ్చు.

ప‌టాన్ చెరు నుంచి సంగారెడ్డి వెళ్లే వాహ‌నాల‌ను ఇంకార్ లేక్ సిటీ అపార్ట్‌మెంట్స్ వ‌ద్ద రైట్ సైడ్ స‌ర్వీస్ రోడ్డుకు మ‌ళ్లించి జాతీయ ర‌హ‌దారిపైకి పంపించ‌నున్నారు. అండ‌ర్ పాస్ రిటైల్ వాల్స్ నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కు ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. వాహ‌న‌దారులు స‌హ‌క‌రించి, ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా చూడాల‌న్నారు.