Traffic Restrictions | ఎల్లుండి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
Traffic Restrictions | ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ -2026 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ -2026 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియంతో పాటు సమీప ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, నిఘా పెంచారు.
5వ తేదీన(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. నాగోల్ ఉంచి హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉప్పల్ జంక్షన్, రామాంతపూర్ మీదుగా రాకపోకలు కొనసాగించే అవకాశం లేదన్నారు.
ఈ మార్గాల్లో లారీలు, డంపర్ ట్రక్కులు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంసీ వాహనాలు, జేసీబీలు, ప్రయివేటు బస్సులు, ట్రాక్టర్లకు అనుమతి లేదు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని వాహనదారులను కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram