Traffic Restrictions | హైద‌రాబాద్ : సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కింద నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సికింద్రాబాద్, ప‌రేడ్ గ్రౌండ్స్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని మ‌ల్కాజ్‌గిరి డిప్యూటీ పోలీసు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

ఆ ర‌హ‌దారి మూసివేత‌

టివోలి ఎక్స్ రోడ్డు నుంచి ప్లాజా ఎక్స్ రోడ్ వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారిని మూసివేయ‌నున్న‌ట్లు డీసీపీ వెల్ల‌డించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇక్క‌డే

సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ ఎక్స్ రోడ్స్, ఎస్బీఐ ఎక్స్ రోడ్స్, ప్లాజా, సీటీవో జంక్ష‌న్, బ్రూక్‌బండ్ జంక్ష‌న్, టీవోలీ జంక్ష‌న్, స్వీకార్ ఉప్‌కార్ జంక్ష‌న్, సికింద్రాబాద్ క్ల‌బ్, ట్యాంక్ బండ్ ఎక్స్ రోడ్, బాల‌మ‌రి ఎక్స్ రోడ్స్, ప్యార‌డైస్, ర‌సూల్‌పురా, బేగంపేట్ ఏరియాలో ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి

ట్రాఫిక్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో సొంత, ప్ర‌యివేటు వాహ‌నాల‌కు బ‌దులుగా ఆర్టీసీ బ‌స్సులు, ఎంఎంటీఎస్, మెట్రో సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని పోలీసులు సూచించారు.

హెల్ప్ లైన్ నంబ‌ర్

ట్రాఫిక్ ఆంక్షల నేప‌థ్యంలో వాహ‌న‌దారుల‌కు ఏదైనా ఎమ‌ర్జెన్సీ సంభ‌విస్తే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబ‌ర్ 8712662999 కాల్ చేయాల‌ని పోలీసులు సూచించారు.