Traffic Restrictions | నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. బీ అలర్ట్..!
Traffic Restrictions | హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ కారణంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ కారణంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. నాగోల్ – హబ్సిగూడ వయా ఉప్పల్, బోడుప్పల్ – అంబర్‌పేట్ వయా రామాంతపూర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
లారీలు, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ప్రయివేటు బస్సులు, జేసీబీ వంటి భారీ వాహనాలకు నాగోల్ – హబ్సిగూడ, బోడుప్పల్ – అంబర్‌పేట్ దారిలో అనుమతి లేదు.
ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద దారి మళ్లించి నాగోల్ మీదుగా ఎల్‌బీనగర్ వైపు మళ్లించనున్నారు.
ఎల్‌బీనగర్ నుంచి తార్నాక, రామాంతపూర్ వైపు వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మళ్లించి బోడుప్పల్, చెంగిచర్ల, ఎన్ఎఫ్‌సీ రోటరీ నుంచి చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు మళ్లించనున్నారు.
వరంగల్ – హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారు ఘట్ కేసర్ లేదా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైదరాబాద్ నగరంలోకి రావొచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram