గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత

వెలుగుమట్ల, రాయగిరి ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గవర్నర్‌ వీసీ శుక్లాను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్ల, రాయగిరి ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం అని కవిత తెలిపారు. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, పరిగి మండలం కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీస్ ను రద్దు చేయాలని, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలపై గవర్నర్ కు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

గవర్నర్ తాము లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెలుతామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రభుత్వ చర్యల కోసం కొంత సమయం వేచి చూసి..తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం అని స్పష్టం చేశారు. తమ వెంట ధర్మసమాజ్ పార్టీ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు, వివిధ జిల్లాల భూ నిర్వాసితులు కూడా గవర్నర్ ను కలిశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం మార్పు లొల్లి !
రైతు గోడుపై గొంతెత్తిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు!

Latest News