TS EAPCET 2024 | టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప‌ర్స్ అంతా ఏపీ విద్యార్థులే..

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి విడుద‌ల చేశారు.

TS EAPCET 2024 | టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప‌ర్స్ అంతా ఏపీ విద్యార్థులే..

హైద‌రాబాద్ : టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో టాప‌ర్స్ అంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విద్యార్థులే నిలిచారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాప్ టెన్ ర్యాంక‌ర్ల‌లో 9 మంది అబ్బాయిలు కాగా, ఒక‌రు మాత్ర‌మే విద్యార్థిని ఉన్నారు. ఆమె ప‌దో ర్యాంకులో నిలిచారు. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో టాప‌ర్స్ కూడా ఏపీ విద్యార్థులే నిలిచారు. ఈ విభాగంలో తొలి ర్యాంకు అమ్మాయి సాధించ‌గా, మ‌రో ఇద్ద‌రు అమ్మాయిలు మూడు, ప‌ది ర్యాంకుల్లో నిలిచారు.

అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణ‌త సాధించారు.

టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్ష‌లు మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ వారికి పరీక్షలను నిర్వహించిన సంగ‌తి తెలిసిందే.

ఇంజినీరింగ్‌లో టాప‌ర్స్

1. స‌తివాడ జ్యోతిరాధిత్య – శ్రీకాకుళం
2. గొల్లలేఖ హ‌ర్ష – క‌ర్నూల్
3. రిషి శేఖ‌ర్ శుక్లా – సికింద్రాబాద్
4. భోగ‌ల‌ప‌ల్లి సందేశ్ – మాదాపూర్, హైద‌రాబాద్
5. ముర‌సాని సాయి య‌శ్వంత్ రెడ్డి – క‌ర్నూల్
6. పుట్టి కుశాల్ కుమార్ – అనంత‌పూర్
7. హుందేక‌ర్ విదిత్ – రంగారెడ్డి
8. రోహ‌న్ సాయి ప‌బ్బ – ఎల్లారెడ్డిగూడ‌, హైద‌రాబాద్
9. కొణ‌తం మ‌ణితేజ – వ‌రంగ‌ల్
10. ధ‌నుకొండ శ్రీనిధి – విజ‌య‌న‌గ‌రం

అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీలో టాప‌ర్స్..

1. ఆలూరు ప్ర‌ణీత – అన్న‌మ‌య్య జిల్లా, ఏపీ
2. న‌గుదశారి రాధాకృష్ణ – విజ‌య‌న‌గ‌రం
3. గ‌డ్డం శ్రీ వ‌ర్ష‌ణి – వ‌రంగ‌ల్
4. సోమ్‌ప‌ల్లి సాకేత్ రాఘ‌వ్ – చిత్తూరు
5. రేపాల సాయి వివేక్ – గోల్కొండ‌, హైద‌రాబాద్
6. మ‌హ్మ‌ద్ అజాన్ సాద్ – మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
7. వ‌డ్ల‌పూడి ముఖేశ్ చౌద‌రి – తిరుప‌తి
8. జెన్ని భార్గ‌వ్ సుమంత్ – కుత్బుల్లాపూర్
9. జ‌య‌శెట్టి ఆదిత్య – కూక‌ట్‌ప‌ల్లి, హైద‌రాబాద్
10. పూల దివ్య తేజ – శ్రీ స‌త్య‌సాయి జిల్లా, హైద‌రాబాద్