TS ECET | 20న టీఎస్ ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌..

TS ECET | టీఎస్ ఈసెట్ 2024 ఫ‌లితాలు సోమ‌వారం(మే 20) విడుద‌ల కానున్నాయి. మాస‌బ్‌ట్యాంక్‌లోని ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాల‌యంలో మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఈసెట్ క‌న్వీన‌ర్ పీ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు.

TS ECET | 20న టీఎస్ ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌..

TS ECET | హైద‌రాబాద్ : టీఎస్ ఈసెట్ 2024 ఫ‌లితాలు సోమ‌వారం(మే 20) విడుద‌ల కానున్నాయి. మాస‌బ్‌ట్యాంక్‌లోని ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాల‌యంలో మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఈసెట్ క‌న్వీన‌ర్ పీ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల‌కు ఈసెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసెట్‌లో అర్హ‌త సాధించిన విద్యార్థుల‌కు ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాదిలోకి ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈసెట్ ఫ‌లితాల కోసం https://ecet.tsche.ac.in/ ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.

ఇక టీఎస్ ఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను మే 6వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష కోసం మొత్తం 99 కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌గా, తెలంగాణ జిల్లాల్లో 48, హైద‌రాబాద్ రిజీయ‌న్‌లో 44, ఏపీలో 7 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 24 వేల మందికి పైగా విద్యార్థులు ప‌రీక్ష రాశారు.