TS Weather | తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. మరో మూడురోజులు తీవ్రమైన వడగాలులు..!
TS Weather | తెలంగాణలు ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలు దాటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పెద్దపల్లి జిల్లాలో 45.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. తాజాగా మరో మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని.. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది
TS Weather | తెలంగాణలు ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలు దాటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పెద్దపల్లి జిల్లాలో 45.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. తాజాగా మరో మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని.. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలుల నేపథ్యంలో ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
ఆదివారం, సోమవారాల్లో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల వడగాలులు వీస్తాయని చెప్పింది. ఈ క్రమంలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే ఒకటిన వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. మరో వైపు ఆదివారం నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram