టీఆర్ఎస్ పేరుపై పూర్తి హక్కులు నాకే ఉన్నాయి: బాలరంగం
టీఆర్ఎస్ పేరుపై పూర్తి హక్కులు తనకేనని తుపాకుల బాలరంగం పేర్కొన్నారు. కవిత కొత్త పార్టీకి అదే పేరును అనుమతించొద్దని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పై వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తమ పాత టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీని పెట్టుకోవడం పట్ల ఓవైపు బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు టీఆర్ఎస్ పేరుపై తనకే పూర్తి హక్కులు ఉన్నాయంటూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం వివాదాన్ని మరో మలుపు తిప్పారు. కవిత టీఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేయొద్దని ఎన్నికల సంఘానికి బాలరంగం లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
2023లోనే తన తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీని ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పది నియోజకవర్గాల్లో పోటీ చేశామని అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. కవిత పార్టీ పూర్తి పేరు ఏదైనా ఆమె టీఆర్ఎస్ అనే అబ్రివేషన్‌తోనే ప్రచారం చేస్తుందని, దాని వల్ల తన పార్టీకి నష్టం కలుగుతుందని బాలరంగం ఈసీకి రాసిన లేఖలో అభ్యంతరం తెలిపారు. కవిత టీఆర్ఎస్ పార్టీని ఆ పేరుతో రిజిస్టర్ చేయొద్దని ఈసీకి తన లేఖలో తొపాకుల బాలరంగం విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
రైతు బంధు లేదు…రాహుల్ బంధు కొనసాగుతుంది : కేటీఆర్
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram