శ్రీలంక జర్నలిస్టులకు ఎంసీ హెచ్‌ఆర్డీలో రెండు వారాల శిక్షణ
శ్రీలంక జర్నలిస్టులు, మీడియా ప్రొఫెషనల్స్ కోసం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్డీ)లో రెండు వారాల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి
విధాత, హైదరాబాద్ : శ్రీలంక జర్నలిస్టులు, మీడియా ప్రొఫెషనల్స్ కోసం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్డీ)లో రెండు వారాల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. జీవోఐ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ శిక్షణ తరగతులను ప్రారంభించగా, డాక్టర్ రావులపాటి మాధవి కోఆర్డీనేటర్‌గా వ్యవహారిస్తున్నారు.
అంతర్జాతీయ భద్రత కోసం కేంద్రం భారత సాంకేతిక ఆర్థిక సహకారం (ఐటీఈసీ) కింద విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. దక్షిణాఫ్రికా,వియత్నాం దేశాల తర్వాత మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులకు వరుసగా 3వ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram