Bandi Sanjay: కేటీఆర్ దమ్ముంటే చర్చకు రా
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ గురించి సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవమని అన్నారు. కవితను జైలు నుంచి విడిపిస్తే విలీనం చేస్తామని కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రతిపాదిస్తే బీజేపీ ఒప్పుకోలేదన్నారు

- కాంగ్రెస్ వాళ్లు చేతకాని దద్దమ్మలు
- అవినీతి సొమ్ముతో కేటీఆర్‌కు అహం పెరిగింది
- బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుంది: కేంద్ర మంత్రి బండి సంజయ్
విధాత: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ గురించి సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవమని అన్నారు. కవితను జైలు నుంచి విడిపిస్తే విలీనం చేస్తామని కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రతిపాదిస్తే బీజేపీ ఒప్పుకోలేదన్నారు. అవినీతి కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవడమనే ముచ్చట ఉండదని స్పష్టం చేశారు. సీఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్దమని చెబుతున్న కేటీఆర్‌కు నేను సవాల్ చేస్తున్నా.. నేను వేదికను ఏర్పాటు చేస్తా, సీఎం రమేశ్‌ను కూడా తీసుకొస్తా..ఆధారాలతో సహా వివరిస్తానన్నారు. డేట్, టైం ఫిక్స్ చేసి, దమ్ముంటే చర్చకు రావాలన్నారు.
అవినీతి సొమ్ముతో కేటీఆర్ కు అహం ఎక్కువైంది
కేటీఆర్ కు అహం తగ్గలేదు. ముఖ్యమంత్రి పదవికి కనీస గౌరవం ఇవ్వాలనే సోయి లేకుండా హౌలే, వాడు, నీ బొంద అని మాట్లాడుతున్నడని మండిపడ్డారు. కనీస సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని వెల్లడించారు కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదని, వాళ్లు చేతకాని దద్దమ్మలని విమర్శించారు.
బీజేపీ సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేస్తుంది
తెలంగాణలో బీజేపీ స్వతహాగా పోటీ చేయబోతోందని బండి పేర్కొన్నారు. ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారన్నారు. ఈసారి బీజేపీకి అవకాశమిద్దామని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలువబోతోందని జోష్యం చెప్పారు.