నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హన్మకొండ వైపు వెళ్లే, వచ్చే వాహనదారులకు..అలాగే సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు పలు సూచనలు చేశారు.
విధాత, హైదరాబాద్ : ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్‌ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌కు మార్చినట్లు, నేటి నుండి అక్కడే బస్సులు ఆగుతాయని అధికారుల తెలిపారు.
బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు.
సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుండి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారి చేరుకోవాలని, చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి రహదారికి చేరుకోవాలని సూచించారు.
అధికారుల సూచనల నేపథ్యంలో ..నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, పనులు ఎన్నటికి పూర్తి చేస్తారోనని వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram