ఉత్తమ్‌కు హోంశాఖ బాధ్యతలు!
సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు శాఖల కేటాయింపు చేసినట్లుగా తెలుస్తుంది. హోం శాఖ మంత్రిగా కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియమించినట్లుగా సమాచారం

కొత్త మంత్రులకు శాఖలు ఫైనల్ !!
విధాత : సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు శాఖల కేటాయింపు చేసినట్లుగా తెలుస్తుంది. హోం శాఖ మంత్రిగా కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియమించినట్లుగా సమాచారం. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖను, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆర్ధిక శాఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పురపాలక, ఐటీ శాఖలు, ధనసరి అనసూయ(సీతక్క)కు గిరిజన సంక్షేమశాఖ, కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమశాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ, తుమ్మల నాగేశ్వర్ రావుకు రోడ్లు భవనాల శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి నీటి పారుదల శాఖ, దామోదరం రాజనరసింహకు వైద్య, ఆరోగ్య శాఖలను కేటాయించినట్లుగా తెలుస్తుంది.