Warangal Airport ​| వాయువేగంతో వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగవంతమవుతోంది. 696 ఎకరాల భూసేకరణ పూర్తికావడంతో నిర్మాణ పనులకు మార్గం సుగమం అయింది. UDAN పథకం కింద ఈ ప్రాంతీయ వైమానిక అనుసంధానం.. పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలపై ఎంతో ప్రభావం చూపనుంది.

Warangal Airport ​| వాయువేగంతో వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు

Warangal Airport Project Takes Off: Land Acquisition Completed, Construction to Begin Soon

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్​:

Warangal Airport| తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరంగల్​ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. నిజాం కాలంలో మామునూరులో నిర్మించబడిన ఈ చారిత్రక విమానాశ్రయాన్ని అత్యాధునిక సదుపాయాలతో పునర్మించి, చారిత్రక వరంగల్ ప్రాంతానికి దేశీయ, అంతర్గత వైమానిక అనుసంధానాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉడాన్ (UDAN) పథకం కింద ఈ విమానాశ్రయం ప్రాంతీయ వృద్ధికి ప్రధాన కేంద్రంగా మారనుందని భావిస్తున్నారు. ఈ దిశగా అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో నిర్మాణ పనులకు అడ్డుకట్టలు తొలగిపోయాయి.

భూసేకరణ పూర్తిప్రభుత్వ లక్ష్యానికి పెద్ద ముందడుగు

మామునూరు ఎయిర్‌పోర్ట్(Warangal International Airport Project) నిర్మాణానికి అవసరమైన 696 ఎకరాల భూసేకరణను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేతృత్వంలో జెట్​స్పీడ్​తో పూర్తి చేశారు. హనుమకొండలో జరిగిన తాజా సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూసేకరణ పూర్తిని అధికారికంగా ప్రకటిస్తూ, కలెక్టర్‌ను అభినందించారు.
భూసేకరణ చేపట్టిన కాలంలో కలెక్టర్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం, భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో చూపించిన చురుకుదనం, మధ్యవర్తిత్వ ప్రక్రియ నిర్వహణ..ఇలా.. మొత్తం జిల్లా పరిపాలనా విభాగం భూసేకరణ ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసింది.

గాడిపల్లి, గుంటూరు పల్లి, నక్కలపల్లి గ్రామాల పరిధిలోని భూముల్ని సేకరించేందుకు అధికారులు పలు దశల్లో భూయజమానులతో సమావేశాలు నిర్వహించారు. రైతులు, భూస్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను వినడం, వారికి స్పష్టమైన వివరణలు ఇవ్వడం, పరిహారాలను సమయానికి చెల్లించడం వంటి అంశాలు ప్రాజెక్ట్ పురోగతిలో కీలక పాత్ర పోషించాయి.

కలెక్టర్​కు, అధికారులకు సన్మానం 

మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం జరిగిన విస్తృత భూసేకరణలో జిల్లా రెవెన్యూ శాఖ, స్థానిక అధికారులు చేసిన కృషిని గుర్తిస్తూ, కలెక్టర్‌ను జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. వరంగల్, నర్సంపేట ఆర్‌డిఓలు సుమ, ఉమారాణి తోపాటు, జిల్లాలోని తహసీల్దారులు, రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్ జిల్లా అభివృద్ధికి కొత్త దారులు తెరవడమే కాకుండా, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సేవారంగం, పర్యాటకం, రవాణా రంగాల్లో ఉద్యోగాలు విస్తృతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

త్వరలో నిర్మాణ నులు ప్రారంభంవరంగల్ ప్రజల్లో నందోత్సాహాలు

A wide-angle view of Warangal airport tarmac with a parked passenger aircraft, green landscaped areas, ground staff, and visitors walking near the runway.

భూసేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో, త్వరలోనే విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన మొదటి దశ పనులు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన డెడ్​లైన్​లోపే  పని పూర్తికావడానికి రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రధాన కారణమని తెలియజేశారు. రైతులు, భూ దాతలు, స్థానిక ప్రజలు అందజేసిన సహకారానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

వరంగల్ ప్రజలకు ఈ అభివృద్ధి ఒక పెద్ద మేలిమలుపుగా మారింది. ఈ చారిత్రక నగరానికి వైమానిక సేవలు అందుబాటులోకి రావడం పర్యాటక రంగానికి, ఐటీ విభాగానికి, వస్త్ర పరిశ్రమలకు, విద్యాసంస్థలకు ఇంకా వ్యాపారాలకు మేలుచేస్తుందని సామాన్యుల నుంచి వ్యాపార వర్గాలదాకా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.