Warangal : సీఐ, కానిస్టేబుల్ ఇద్దరి సస్పెండ్

మామూనూరు పోలీస్ స్టేషన్‌లో అవినీతి ఆరోపణలతో సీఐ రమేష్, కానిస్టేబుల్ రఘు సస్పెండ్. వరంగల్ సీపీ విచారణ నివేదికలతో చర్య.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 26, 2025, 6:45 pm IST
Read Time: 2 mins
Warangal : సీఐ, కానిస్టేబుల్ ఇద్దరి సస్పెండ్

విధాత, వరంగల్ : కమిషనరేట్ పరిధిలోని మామూనూరు పోలీస్ స్టేషన్ నుండి కంట్రోల్ రూమ్ కు బదిలీ అయిన స్పెక్టర్ ఓ. రమేష్ తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ జి. రఘును సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఇరువురు మామూనూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సమయంలో వీరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై చేపట్టిన అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడం సీపీ వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.