Warangal : ఏసీపీ, ఇన్స్ స్పెక్టర్, ఎస్ఐ లను సస్పెండ్ చేసిన డీజిపి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఆరోపణలపై ఏసీపీ నందిరాం నాయక్, ఇన్‌స్పెక్టర్ గోపి, ఎస్ఐ విఠల్‌ను డీజీపీ శివధర్ రెడ్డి సస్పెండ్ చేశారు.
విధాత, వరంగల్ ప్రతినిధి: గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుత సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ గోపి, ఎస్. ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
DA Hike For Electricity Employees : విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 17.651 శాతం డీఏ ఖరారు
Uttam Kumar Reddy : హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram