నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

- వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యం
- ఎమ్మెల్యే నోముల భగత్
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు శనివారం నీటిని విడుదల చేశారు. ఎన్ఎస్ పీ అధికారులతో కలిసి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ నీటిని విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పరిపాలిస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో వరుసగా 8 ఏళ్లు రెండు పంటలకు నీటిని ఇచ్చామని చెప్పారు.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి విడుదల ఆలస్యమైనప్పటికీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రితో కలిసి రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వెంటనే రైతులను కాపాడాలనే ఉద్దేశంతో నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు ఎస్ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున పది రోజులపాటు ఐదు టీఎంసీల నీటిని ఎడమ కాలువ ద్వారా మొదటి జోన్ రైతులకు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్ కర్ణ అనూష శరత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్లు జువ్వాజీ వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బిన్నీ, కో ఆప్షన్ మెంబర్ బషీర్, మార్కెట్ డైరెక్టర్ రాజేష్ నాయక్, సర్పంచ్ సలహాదారులు పాల్తి శంకర్ నాయక్, ఎస్సీ నాగేశ్వర రావు, ఈఈ మల్లికార్జున్, డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణయ్య, ఎన్నేస్పి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.