Hyderabad | హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ వాసులను జలమండలి అప్రమత్తం చేసింది. హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంప్ ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు కొనసాగుతున్నాయి
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులను జలమండలి అప్రమత్తం చేసింది. హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంప్ ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నీటి సరఫరాను అత్యవసరంగా నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు – 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం, కొన్నిచోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుంది. మరి కొన్నిప్రాంతాల్లో లో ప్రెజర్‌తో నీటిని సరఫరా చేయనున్నారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్‌పీఏ), మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్, భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్‌పేట్, బడంగ్‌పేట్, శంషాబాద్. ఈ ఏరియాల్లో ఉండే వారు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram