Water Supply | రేపు హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్.. జర జాగ్రత్త..!
Water Supply | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో వారానికో సారి ఎక్కడో ఒక చోట తాగునీటి( Drinking Water ) సరఫరాకు ఆటంకం కలుగుతూనే ఉంటుంది.

Water Supply | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో వారానికో సారి ఎక్కడో ఒక చోట తాగునీటి( Drinking Water ) సరఫరాకు ఆటంకం కలుగుతూనే ఉంటుంది. మంచినీటి పైపుల మరమ్మతుల కారణంగానో, వాటర్ ట్యాంకులను శుభ్రపరచడంలో భాగంగానో, ఇతర కారణాల వల్ల నీటి సరఫరా( Water Supply )కు అంతరాయం ఏర్పడుతుంది.
తాజాగా గోదావరి( Godavari ) జలాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చే పైపు లైన్లలో రిపేర్ వర్క్ కారణంగా.. షాపూర్ నగర్, హైదర్‌నగర్, అల్వాల్ ఏరియాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 12 ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి ఆయా కాలనీల ప్రజలు నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, హెచ్ఎంటీ సొసైటీ, హెచ్ఏఎల్ కాలనీ, టీఎస్ఐఐసీ కాలనీ, రోడా మిస్త్రీ నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరా నగర్, గాజులరామారం, శ్రీసాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాస్ హిల్స్, బాలాజీ లే అవుట్, కైసర్ నగర్, గాజులరామారం ఏరియాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.