WhatsApp Scam| వాట్సాప్‌లో కొత్త మోసం… ‘ఘోస్ట్ పేయిరింగ్’తో జాగ్రత్త!
వాట్సాస్ యూజర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ జారీ చేశారు. "హేయ్.. మీ ఫొటో చూశారా?" అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఇదొక 'ఘోస్ట్ పేయిరింగ్' (GhostPairing) స్కామ్ లింక్ అని తెలిపారు.
విధాత, హైదరాబాద్ : వాట్సాస్ యూజర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (VC Sajjanar)వార్నింగ్ జారీ చేశారు. “హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్ లింక్(WhatsApp Scam) అని తెలిపారు. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుందని, ఓటీపీ గానీ, స్కానింగ్ గానీ లేకుండానే.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుందని తెలిపారు.
ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారని, మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారని, మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారని హెచ్చరించారు. చివరికి మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్ చేస్తారు అని వీసీ సజ్జనార్ అలర్ట్ సందేశం ఇచ్చారు. ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్ మొత్తం హ్యాకర్ల పరమవుతుందని వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు.
అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు అని, వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ పరిశీలించాలని, తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్ చేయాలని సజ్జనార్ తెలిపారు. Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని సూచించారు.
ఆర్బీఐ ‘ఉద్గమ్’ పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల!
అంతకుముందు సజ్జనార్ ఆర్బీఐ తీసుకొచ్చిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై ప్రజలను హెచ్చరించారు. “మీ పాత ఖాతాల్లో లక్షలున్నయ్.. ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి” అని మెసేజ్ లు, మెయిల్స్ పంపిస్తున్నారని..ఆశపడి ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్ అయిపోయి..క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని అలర్ట్ చేశారు. దీనిపై ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఆర్బీఐ ఎప్పుడూ మీ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదు. ఆఫీసర్లు అని ఫోన్ చేస్తే నమ్మవద్దని సూచించారు. అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కోసం https://udgam.rbi.org.in అనే వెబ్‌సైట్ మాత్రమే చూడాలని తెలిపారు. వాట్సాప్, మెయిల్స్ లో వచ్చే పిచ్చి లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయండి. లేదంటే http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆలస్యం చేస్తే మీ డబ్బులు పోగొట్టుకుంటారని హెచ్చరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram