Wine Shops | మందుబాబులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్
Wine Shops | మందుబాబులకు అలర్ట్.. మళ్లీ హైదరాబాద్( Hyderabad )లో వైన్ షాపులు( Wine Shops ), బార్లు( Bars ) మూతబడనున్నాయి. మొన్న శ్రీరామనవమి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయగా.. ఇప్పుడు ఏప్రిల్ 12(శనివారం) న హనుమాన్ జయంతి( Hanuman Jayanthi ) సందర్భంగా మూతబడనున్నాయి.

Wine Shops | హైదరాబాద్ : మందుబాబులకు అలర్ట్.. మళ్లీ హైదరాబాద్( Hyderabad )లో వైన్ షాపులు( Wine Shops ), బార్లు( Bars ) మూతబడనున్నాయి. మొన్న శ్రీరామనవమి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయగా.. ఇప్పుడు ఏప్రిల్ 12(శనివారం) న హనుమాన్ జయంతి( Hanuman Jayanthi ) సందర్భంగా మూతబడనున్నాయి.
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీలోని గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది. రాష్ట్రస్థాయి వీహెచ్‌పీ భజరంగ్‌దళ్ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గౌలిగూడ నుంచి మొదలయ్యే శోభాయాత్రకు దాదాపు 17వేల మందితో పాటు 3 వేల మంది పోలీసు అధికారులతో పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.