ఖైరతాబాద్ మహా గణపతి ఎదుట మహిళా ప్రసవం

వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కి చెందిన గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో ఆకస్మికంగా పురిటినొప్పులకు తో పాపకు జన్మనిచ్చింది

ఖైరతాబాద్ మహా గణపతి ఎదుట మహిళా ప్రసవం

విధాత, హైదరాబాద్ : వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కి చెందిన గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో ఆకస్మికంగా పురిటినొప్పులకు తో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది వెంటనే తల్లి బిడ్డలను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. వైద్యులు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వినాయక చవితి రోజున ఆ చిన్నారి జన్మించడం ఎంతో అదృష్టమని భావిస్తున్నారు.