Uttam Kumar Reddy | లబ్ధిదారులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు .. త్వ‌ర‌లో విధివిధానాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేష‌న్‌కార్డుల‌ను జారీ చేసేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు

Uttam Kumar Reddy | లబ్ధిదారులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు .. త్వ‌ర‌లో విధివిధానాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేష‌న్‌కార్డుల‌ను జారీ చేసేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో రెవెన్యూ శాఖ అధికారుల‌తో నిర్వ‌హించిన సమావేశంలో ఆయ‌న ఈ మేర‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్రక‌టించారు. తెల్ల రేషన్ కార్డుతో సంబం ధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయ‌న తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ‌త ప్ర‌భుత్వం కొత్త రేష‌న్‌కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను ఆపేయ‌డంతో చాలా మంది పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ప‌డ్డారు. ఇటీవ‌లే ప్ర‌భుత్వం రేష‌న్‌కార్డులో కుటుంబ స‌భ్యుల మార్పులు చేర్పుల కోసం కూడా అవ‌కాశం క‌ల్పించింది. కాగా ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం ప్రభుత్వం ఏర్ప‌డిన కొత్త‌లోనే ద‌ర‌ఖాస్తులు తీసుకున్న‌ది. ఇందులో పెద్ద ఎత్తున కొత్త రేష‌న్‌కార్డుల కోసం ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వాట‌న‌న్నింటినీ అధికారులు భ‌ద్ర‌ప‌రిచారు. అప్పుడు ప్ర‌భుత్వం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఎట్ట‌కేల‌కు కొత్త రేష‌న్‌కార్డుల జారీకి ప్ర‌భుత్వం సానుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో చాలా మందికి ఊర‌ట‌నే చెప్పాలి.