Manchu Vishnu | పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అంటే.. మంచు విష్ణు ఇలా అనేశాడేండి?

Manchu Vishnu | ఒక నటుడు మరొక నటుడిని గౌరవించడం, పొగడటం అనేది ఎప్పుడూ ఉన్నా, మనకు నచ్చిన హీరోని మరో హీరో మెచ్చుకున్నాడంటే అది హాట్ టాపిక్ అయి తీరుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మంచు విష్ణు ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధిస్తాడని మీరు అనుకుంటున్నారా? అని యాంకర్ వేసిన ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పాడు మంచు విష్ణు. ‘‘నేనేం బ్రహ్మం […]

  • Publish Date - August 22, 2023 / 02:35 AM IST

Manchu Vishnu |

ఒక నటుడు మరొక నటుడిని గౌరవించడం, పొగడటం అనేది ఎప్పుడూ ఉన్నా, మనకు నచ్చిన హీరోని మరో హీరో మెచ్చుకున్నాడంటే అది హాట్ టాపిక్ అయి తీరుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మంచు విష్ణు ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధిస్తాడని మీరు అనుకుంటున్నారా? అని యాంకర్ వేసిన ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పాడు మంచు విష్ణు.

‘‘నేనేం బ్రహ్మం గారినైతే కాదుగా ఆయన విజయం సాధిస్తాడో లేదో చెప్పేయడానికి.. ఆయన రాజకీయాల గురించి కాకుండా సినిమాల గురించి అడగండి. సమాధానం చెబుతాను అన్నాడు’’. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ‘పవన్ సినిమా ఒకటి ఆడకపోయినా తర్వాత సినిమాకి రెట్టింపు కలెక్షన్స్ రావడం ఖాయం.. అందుకే ఆయన స్టార్ పవర్ అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

పవన్ కళ్యాణ్ కింగ్ అవుతాడా? లేక కింగ్ మేకర్ అవుతాడా? అనే ప్రశ్న కూడా మంచు విష్ణుకి ఎదుదైంది. ఈ ప్రశ్నకు జవాబిస్తూ.. ‘‘ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకు ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. ఎవరు నచ్చితే వాళ్లకే ఓటు వేస్తారు. దేశాన్ని బాగు చేయాలనే అభిలాష ఉన్నవారినే నాయకులుగా ఎన్నుకుంటారు’’ అని అన్నాడు మంచు విష్ణు.

ఇక తను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదనే క్లారిటీని కూడా ఈ ఇంటర్వ్యూలో ఇచ్చాడు ఈ మంచువారబ్బాయ్. ఇక తన కొత్త సినిమా భారీ బడ్జెట్‌తో ‘భక్త కన్నప్ప’ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుందని.. ప్రస్తుతం ఆ సినిమాపైనే తన దృష్టి అంతా ఉన్నట్లుగా చెప్పిన మంచు విష్ణు.. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు కానుంది.

అలాగే ఆయనొక రియాలిటీ షో కూడా ప్లాన్ చేస్తున్నాడట, దీనిలో సినిమాకు సంబంధించిన చాలా వివరాలు తెలుస్తాయని చెప్పాడు. గత కొద్ది కాలంగా ఎటువంటి సినిమా చేయని విష్ణు.. మళ్లీ భక్త కన్నప్ప సినిమాతో ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Latest News