‘జవాన్‌’తో.. దక్షణాదిని టార్గెట్‌ చేస్తున్న బాలీవుడ్ బాద్‌షా .!

విధాత: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పఠాన్. జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించగా, దీపికా పడుకొనే హీరోయిన్ పాత్ర‌ను పోషించింది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఇండియన్ రా ఏజెంట్‌గా నటించారు. కథ రొటీన్‌గా ఉన్న మేకింగ్ అద్భుతంగా ఉందనే స్పందన వస్తుంది. సామాన్య జ‌నం నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామన్ […]

‘జవాన్‌’తో.. దక్షణాదిని టార్గెట్‌ చేస్తున్న బాలీవుడ్ బాద్‌షా .!

విధాత: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పఠాన్. జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించగా, దీపికా పడుకొనే హీరోయిన్ పాత్ర‌ను పోషించింది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఇండియన్ రా ఏజెంట్‌గా నటించారు.

కథ రొటీన్‌గా ఉన్న మేకింగ్ అద్భుతంగా ఉందనే స్పందన వస్తుంది. సామాన్య జ‌నం నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామన్ ఆడియన్స్ నుంచి అదిరి పోయే రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు 55 కోట్ల షేర్లు రాబట్టింది. రెండో రోజు ఏకంగా 60 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఇలా రోజు రోజుకి పఠాన్ సందడి పెరుగుతోంది. ఈ కలెక్షన్లు వీకెండ్‌లో మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సినిమా కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసింది. ఇటీవ‌ల బాలీవుడ్‌లో కేజీఎఫ్, బాహుబ‌లి వంటి చిత్రాలు నెల‌కొల్పిన కలెక్షన్స్ రికార్డును కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్రం 500 కోట్ల దిశ‌గా సాగి ఆ మార్కును ట‌చ్ చేసింద‌ని, ఈ వారాంతం వరకు ఈ స్పీడ్ కొనసాగితే క‌లెక్ష‌న్ల ధాటి ఏ స్థాయిలో ఉండ‌బోతోంది? అనే అంచ‌నాలో ట్రేడ్ వ‌ర్గాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌లో ఉన్న చాలా రికార్డుల‌ను ఈ చిత్రం దాటిపోవడం పక్కా అనే మాట వినిపిస్తోంది. మరిన్ని రికార్డులను క్రియేట్ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

దీని తరువాత షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు, తెలుగింటి అల్లుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి దక్షిణాదిన మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీలో ఇళయ దళపతి విజయ్ కూడా గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

అందులోనూ సౌత్ ఫ్లేవ‌ర్‌లో రూపొందుతున్న మూవీ కాబట్టి పఠాన్ కంటే ఈ చిత్రం ఎలివేషన్స్ పరంగా ఇతరత్రా మరింత కొత్తగా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పఠాన్ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో జవాన్ చిత్రానికి సౌత్ ఇండియన్ ప్రేక్షకులు కూడా బ్రహ్మర‌థం పట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.