IRCTC Sri Lanka Tour | శ్రీలంకలో రామాయణ ఇతిహాసాలను చూసొద్దామా..? హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!
IRCTC Sri Lank Tour | ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీని ప్రకటించింది. వేసవి సెలవుల్లో వివిధ దేశాల్లో పర్యటించాలనుకునే వారి కోసం ‘శ్రీలంక రామాయణ యాత్ర శాంకరి దేవి శక్తిపీఠం ఎక్స్’ హైదరాబాద్ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో శ్రీలంకలోని రామాయణ కాలం నాటి ప్రదేశాలతో పాటు శాంఖరి శక్తిపీఠాన్ని సైతం వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నది.
IRCTC Sri Lanka Tour | ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీని ప్రకటించింది. వేసవి సెలవుల్లో వివిధ దేశాల్లో పర్యటించాలనుకునే వారి కోసం ‘శ్రీలంక రామాయణ యాత్ర శాంకరి దేవి శక్తిపీఠం ఎక్స్’ హైదరాబాద్ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో శ్రీలంకలోని రామాయణ కాలం నాటి ప్రదేశాలతో పాటు శాంఖరి శక్తిపీఠాన్ని సైతం వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నది. భారత్, శ్రీలంక మధ్య పొరుగు దేశమే కాదు. ఆ దేశంతో మనకు ఆధ్యాత్మిక సంబంధాలు సైతం ఉన్నాయి. రామాయణకాలం నుంచి కొనసాగుతున్నాయి. టూర్ ప్యాకేజీలో హిందూ దేవాలయాలు, రామాయణంతో సంబంధాలున్న ప్రాంతాలను సందర్శించవచ్చు. అలాగే, శ్రీలంకలోని అద్భుతమైన ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ప్యాకేజీ జూన్ 1న అందుబాటులో ఉన్నది. ఐదురోజులు, నాలుగు రాత్రుల పాటు పర్యటన కొనసాగనున్నది.
పర్యటన సాగేదిలా..
జూన్ ఒకటిన తొలిరోజు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి పర్యటన మొదలవుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు వరకు దంబుల్లా చేరుకుంటారు. ఆ తర్వాత చిలావ్‌లోని మునీశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం మనవేరి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత మళ్లీ దంబుల్లా చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. రెండోరోజు అల్పాహారం పూర్తి చేసుకొని హోటల్ చెక్ అవుట్ చేస్తారు. ట్రింకోమలికి వెళ్లి తిరుకోణేశ్వర్ లక్ష్మీనారాయణ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత క్యాండీ హిల్‌స్టేషన్ సందర్శనకు వెళ్తారు. జేమ్స్ ఫ్యాక్టరీ, బాటిక్ ఫ్యాక్టరీ, టూత్ టెంపుల్‌ని సందర్శిస్తారు. రాత్రి క్యాండీలోనే బస ఉంటుంది.
మూడోరోజు నువారేలియా బయలుదేరుతారు. మార్గమధ్యంలో రాంబోడాలో హనుమాన్ ఆలయం, సీతా అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటికను సందర్శించి.. తిరిగి రాత్రి క్యాండీలోనే బస చేస్తారు. నాలుగోరోజు పిన్నవాలా ఎలిఫెంట్ అనాథ ఆశ్రమం, పంచముగ ఆంజనేయర్ ఆలయం, కెలనియా బుద్ధ దేవాలయం, క్లాక్ టవర్, గాల్ ఫేస్, కొలంబో హార్బర్, బైరా లేక్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మ్యూజియం, నేలమ్ పోకునా థియేటర్ అండ్ టౌన్ హాల్‌తో సహా లైట్‌హౌస్‌తో సహా కొలంబో నగర పర్యటనకు వెళ్తారు. రాత్రికి షాపింగ్ చేసుకొని.. నెగొంబోలో బస చేస్తారు. ఐదో రోజు ఉదయం 4 గంటలకు విమానాశ్రయానికి చేరుకొని.. 7.25గంటలకు బయలుదేరి.. 9.20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ ఇలా..
రామాయణ యాత్రలో శ్రీలంకలోని సహజ అద్భుతాలు ప్రదేశాలతో పాటు పవిత్రమైన దేవాలయాలు, ప్రకృతి సంపదతో అలరాలే ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ టూర్ ప్యాకేజీ 3-స్టార్ హోటళ్లలో వసతి, భోజన సదుపాయం, ఏసీ బస్సుల్లో రవాణా సదుపాయం, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడే టూర్ గైడ్‌తో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. విమాన టిక్కెట్లు, ప్రయాణంలో సందర్శనా స్థలాల్లో ప్రవేశ ఛార్జీలు, ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ప్యాకేజీలో సింగిల్ షేరింగ్‌కు రూ.62,660, డబుల్ షేరింగ్‌కు రూ.51,500 ధర నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.49,930 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు బెడ్‌తో టికెట్ రూ.39,440.. బెడ్ అవసరం లేదనుకుంటే రూ.37,430 చెల్లిస్తే సరిపోతుంది. వివరాల కోసం irctctourism.comలో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ సూచించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram