Telangana Tourism Goa Tour | గోవా వెళ్దామనుకుంటున్నారా..? ఆగండి ఆగండి..! తెలంగాణ టూరింజ ఆఫర్‌ తెలుసా..?

Telangana Tourism Goa Tour | వేసవి సెలవుల్లో చాలామంది చల్లటి ప్రదేశాలకు వెళ్లి చిల్‌ అవ్వాలని అనుకుంటారు. మరికొందరు హిల్‌స్టేషన్లు, బీచ్‌లకు వెళ్లాలనుకుంటుంటారు. బీచ్‌లకు వెళ్లాలనుకునే వారంతా ఎక్కువగా గోవాకు వెళ్లాలనుకుంటున్నారు. మీరు కూడా గోవా అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే, మీకోసమే తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి తక్కువ ధరకే గోవా టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తున్నది.

Telangana Tourism Goa Tour | గోవా వెళ్దామనుకుంటున్నారా..? ఆగండి ఆగండి..! తెలంగాణ టూరింజ ఆఫర్‌ తెలుసా..?

Telangana Tourism Goa Tour | వేసవి సెలవుల్లో చాలామంది చల్లటి ప్రదేశాలకు వెళ్లి చిల్‌ అవ్వాలని అనుకుంటారు. మరికొందరు హిల్‌స్టేషన్లు, బీచ్‌లకు వెళ్లాలనుకుంటుంటారు. బీచ్‌లకు వెళ్లాలనుకునే వారంతా ఎక్కువగా గోవాకు వెళ్లాలనుకుంటున్నారు. మీరు కూడా గోవా అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే, మీకోసమే తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి తక్కువ ధరకే గోవా టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తున్నది. ప్యాకేజీలో పర్యటన నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. టూర్‌ ప్యాకేజీని రూ.11,999కే అందుబాటులోకి తీసుకువచ్చంది. ఈ పర్యటనలో గోవాలోని బీచ్‌లతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు అవకాశం కలుగనున్నది.

బస్సులో ప్రయాణం..

గోవా అంటేనే పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. ఎక్కువగానే విదేశీ పర్యాటకులే ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడి బీచ్‌ల అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతి రమణీయతతో కూడిన గోవా అందాలను వీక్షించాలనుకునే వారి కోసం టూరిజం ‘గోవా ప్యాకేజీ టూర్‌ ఇటెనరరి’ పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్యాకేజీలో ప్రయాణం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారానే గోవాకు చేరుకుంటారు.

టూర్ కొనసాగేదిలా..

హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం గోవా టూర్‌ ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. పర్యటనలో భాగంగా తొలిరోజు హైదరాబాద్‌లోని బషీర్‌భాగ్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మరునాడు ఉదయం కలంగుట్‌కి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి నార్త్ గోవాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, అగుడా పోర్ట్‌, బాగా బీచ్‌లను వీక్షిస్తారు. వీటితో పాటు మరో రెండు బీచ్‌లకు కూడా వెళ్తారు. ఇక మూడోరోజు సౌత్‌ గోవాలో పర్యటన ఉంటుంది. అక్కడ ఓల్డ్ గోవా చర్చిలతో పాటు డోనా పౌలా బీచ్‌కి వెళ్తారు. సౌత్ గోవాలో మంగూషీ టెంపుల్‌ సందర్శనతో పాటు మిరామార్‌ బీచ్‌, , కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌ల అందాలను ఆస్వాదించొచ్చు. పాన్ జిమ్‌లో సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీ సైతం ఉంటుంది. అయితే, బోట్‌ జర్నీ కోసం ప్రయాణికులే ఛార్జీలను భరించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోరోజు కలంగుట్‌ నుంచి ఉదయం 11 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఐదోరోజు 6 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో ప్యాకేజీ పర్యటన ముగుస్తుంది.

టికెట్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?

తెలంగాణ టూరిజం హైదరాబాద్‌ నుంచి గోవా టూర్‌ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.11,999 ధర నిర్ణయించింది. పిల్లలకు రూ.9,599 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ అక్యుపెన్సీకి రూ.14,900 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ tourism.telangana.gov.in లో సంప్రదించాలని కోరింది. లేదంటే 9848540371 నెంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.