ప్రపంచంలో తొలిసారి అమెరికాలో డ్రైవర్ లేకుండా నడిపే వాహనాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాతి దేశంగా ఇప్పుడు మధ్య ప్రాచ్యానికి చెందిన అబుదాబి చేరింది. చైనా దేశానికి చెందిన వీరైడ్ సంస్థతో కలిసి ఉబర్ టెక్నాలజీస్ అబుదాబిలో డ్రైవర్ లెస్ రొబోటాక్సీని ప్రారంభించింది. రెండు వారాలు ప్రయోగాత్మకంగా నడిపించిన తరువాత ఇక నుంచి శాశ్వతంగా నడపాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.
యాస్ ఐలాండ్ లో ప్రస్తుతం 10 రోబో టాక్సీలు నడుస్తున్నాయని, ఈ సంవత్సరం ముగింపు నాటికి అల్ రీమ్, అల్ మరాయహ మొత్తం విస్తరిస్తామని ప్రకటించింది. అబుదాబికి చెందిన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్టు సెంటర్ అన్ని ప్రమాణాలు పాటించిన తరువాతే డ్రైవర్ లెస్ టాక్సీలకు అనుమతించింది. వీరైడ్ సంస్థ 2021 నుంచి టాక్సీ సర్వీసులను అందిస్తున్నది. ఉబర్ సహకారంతో అబుదాబి మొత్తం టాక్సీ సర్వీసులను మున్ముందు అందించనున్నది. రోబో టాక్సీల రాకతో ముఖ్యంగా పెద్ద వాళ్లకు, దివ్యాంగులకు ఎంతో సులువుగా ఉండనున్నదని వీరైడ్ చెబుతోంది. మానవ తప్పిదాలు ఉండవని, ప్రమాదాలు జరిగే అస్కారం ఉండదని, దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటోంది.
Read Also |
Washing Machine Blast | హైదరాబాద్‌లో పేలిన వాషింగ్ మిషన్
Tooth Regrowth : డెంటల్ ట్రీట్మెంట్ లో విప్లవాత్మక మార్పు!
Sea Snakes | భయంకరమైన సముద్ర పాముల గురించి తెలుసా?
