Kajipet | కాజీపేట-బల్లార్షా సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. నిలిపివేత

Kajipet | భాగ్యనగర్ తో సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలిపివేత ఉప్పరపల్లి అండర్ బ్రిడ్జి వద్దకు వరద నీరు ట్రాక్ పరిస్థితిని పరిశీలించిన రైల్వే శాఖ ఇంజనీర్లు విధాత బ్యూరో, కరీంనగర్: దక్షిణ మధ్య రైల్వే కాజీపేట బల్లార్షా సెక్షన్ల మధ్య మంగళవారం ఉదయం రైళ్ల రాకపోకులకు కొద్దిసేపు అంతరాయం వాటిల్లింది. ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామం రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 35/E వద్ద అధికారులు రెండేళ్ల క్రితం అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. […]

Kajipet | కాజీపేట-బల్లార్షా సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. నిలిపివేత

Kajipet |

  • భాగ్యనగర్ తో సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలిపివేత
  • ఉప్పరపల్లి అండర్ బ్రిడ్జి వద్దకు వరద నీరు
  • ట్రాక్ పరిస్థితిని పరిశీలించిన రైల్వే శాఖ ఇంజనీర్లు

విధాత బ్యూరో, కరీంనగర్: దక్షిణ మధ్య రైల్వే కాజీపేట బల్లార్షా సెక్షన్ల మధ్య మంగళవారం ఉదయం రైళ్ల రాకపోకులకు కొద్దిసేపు అంతరాయం వాటిల్లింది. ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామం రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 35/E వద్ద అధికారులు రెండేళ్ల క్రితం అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.

కథ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అండర్ బ్రిడ్జి ప్రాంతం వరద నీటితో నిండడం, ట్రాక్ పక్కకు నీరు చేరుకోవడంతో సోమవారం రాత్రి నుండే ఇక్కడ పరిమిత వేగంతో రైళ్లను నడిపించారు. మంగళవారం ఉదయం పలు రైళ్లను పొత్కపల్లి, జమ్మికుంట, రాఘవపూర్, పెద్దపల్లి స్టేషన్లలో కొద్దిసేపు నిలిపివేశారు.

రైల్వే శాఖ ఇంజనీర్లు ఉప్పరపల్లి వద్దకు చేరుకొని అండర్ బ్రిడ్జి సమీపంలో ట్రాక్ పరిస్థితిని పరిశీలించారు. కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తో పాటు అనేక రైళ్లు
కొద్దిసేపు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

అండర్ బ్రిడ్జిలతో అసలు సమస్య..

రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులు, ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వే శాఖ రద్దీ లేని మార్గాలలో అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు ముందుకు వచ్చింది. ఓదెల మండలంలోని ఓదెల, హరిపురం, ఉప్పరపల్లి, పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామాల వద్ద లెవెల్ క్రాసింగ్ ల వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణాలను రైల్వే శాఖ ప్రారంభించింది. ఇందులో కొన్ని నిర్మాణం పనులు పూర్తి చేసుకోగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

అయితే భారీ వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జిలు నీటితో మునిగిపోయి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆయా సందర్భాల్లో రైల్వే శాఖ ప్రైవేట్ కాంట్రాక్టర్లతో నీటిని తోడించాల్సి వస్తోంది.
ప్రస్తుతం ఉప్పరపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జి వరద నీటితో నిండిపోవడంతో అతి ప్రధానమైన ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.