భువనగిరి: వైద్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

విధాత, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీగా ఉన్న పల్లె దవాఖానాలకు డాక్టర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.కే.మల్లికార్జున రావు తెలిపారు. ఒప్పంద పద్దతిపై భర్తీ చేసేందుకు 27 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. మొదటి ప్రాధాన్యం ఎంబీ బీఎస్ వైద్యులకు, తర్వాత బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ య‌మ్, కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్స్ చదివిన వారికి చివరి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు తేది : 09.09.2022 […]

భువనగిరి: వైద్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

విధాత, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీగా ఉన్న పల్లె దవాఖానాలకు డాక్టర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.కే.మల్లికార్జున రావు తెలిపారు.

ఒప్పంద పద్దతిపై భర్తీ చేసేందుకు 27 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. మొదటి ప్రాధాన్యం ఎంబీ బీఎస్ వైద్యులకు, తర్వాత బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ య‌మ్, కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్స్ చదివిన వారికి చివరి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు.

అర్హులైన అభ్యర్థులు తేది : 09.09.2022 నుంచి 17.09.2022 లోపు ఉదయం 10:30 నుంచి సమయం సాయంత్రం: 05:00 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము, కల్లెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్స్, రూమ్ నెం. జీ17, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా నందు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.