Jubilee Hills Bypoll| జూబ్లీహిల్స్ లో కారును పోలిన గుర్తుల కేటాయింపు
గతంలో అసెంబ్లీ, లోక్ సభలో ఎన్నికలలో బీఆర్ఎస్ కు చేదు అనుభవాలను మిగిలించిన కారును పోలిన ఎన్నికల గుర్తులు మరోసారి ఆ పార్టీని భయపెడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఇండిపెండెంట్ లకు కారును పోలిన ఫ్రీ సింబల్స్ కేటాయించడం సమస్యగా ఆ పార్టీకి సమస్యగా మారింది.
విధాత : గతంలో అసెంబ్లీ, లోక్ సభలో ఎన్నికలలో బీఆర్ఎస్ కు చేదు అనుభవాలను మిగిలించిన కారును పోలిన ఎన్నికల గుర్తులు మరోసారి ఆ పార్టీని భయపెడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)లో ఇండిపెండెంట్ లకు కారు(car simble)ను పోలిన ఫ్రీ సింబల్స్ కేటాయించడం సమస్యగా ఆ పార్టీకి సమస్యగా మారింది. ఇండిపెండెంట్ లకు చపాతీ రోలర్, రోడ్ రోలర్, షిప్, సోప్ డిష్ , టీవీ వంటి ఫ్రీ సింబల్స్ ను ఈసీ కేటాయించింది. ఈ సింబల్స్ కారు గుర్తును పోలి ఉంటాయని గతంలోనే బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోసారి అవే గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం బీ ఆర్ఎస్ కు మింగుడు పడని పరిణామంగా చెప్పవచ్చు.
భయపెడుతున్న గత అనుభవాలు
గతంలో 2019 భువనగిరి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చేసిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5000 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఇక్కడ కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది.
2018 ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల ల వల్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు 20కి పైగా స్థానాల్లో నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాపోయింది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల కన్నా.. కారును పోలిన గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలవడాన్ని ఇందుకు రుజువుగా చూపింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ లో 2018 ఎన్నికల్లో రోడ్డు రో లర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ పేర్కొంది. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, అసిఫాబాద్, బాన్సువాడ, గద్వాల, నాగార్జునసాగర్లలో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని నివేదించింది.
నకిరేకల్ నుంచి పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య కు 8509 ఓట్ల మెజారిటీ రాగా, ఇక్కడి నుంచి సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ట్రక్కు గుర్తుపై పోటీ చేసిన దుబ్బ రవికి ఏకంగా 10,383 ఓట్లు వచ్చాయి, అప్పటి కోదాడ ఎన్నికల్లోను బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేకు 756 ఓట్లు మెజారిటీ రాగా.. స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 5240 ఓట్లు రావడానికి బీఆర్ ఎస్ గుర్తు చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram