King Cobra Special Features Videos | కింగ్ కోబ్రాలు ఏకాంత జీవితం ఎందుకు గడుపుతాయి? ఇవే వాటి జీవన రహస్యాలు…
కింగ్ కోబ్రాలు తినే ఆహారం ఏంటో తెలుసా? కింగ్ కోబ్రాలను బహుదూరపు బాటసారులని ఎందుకంటారో విన్నారా? కింగ్ కోబ్రాలు ఏకాంత జీవితం ఎందుకు గడుపుతాయి? కింగ్ కోబ్రాల జీవన రహస్యాలు.. చదివేయండి..
King Cobra Special Features | కింగ్ కోబ్రా! పేరులోనే దాని ప్రత్యేకత ఉంటుంది. పాముల్లో రాజు! అన్ని రకాల పాముల జాతుల్లో కింగ్ కోబ్రాకు చాలా ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి. కేవలం పరిమాణం మాత్రమే కాదు.. దాని ప్రవర్తన, వాటి సహజ ఆవాసాల్లో రక్షణ వ్యవస్థ.. అన్నీ ప్రత్యేకమే. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం.. ఒఫియోఫాగస్ హన్నాహ్. దీని అత్యంత శక్తిమంతమైన విషం ఒక ఎత్తయితే.. దాని ప్రత్యేకమైన జీవన శైలి, ఆహారం, ఆహారం కోసం వేటాడే తీరు, దాని కదలికలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఇది సాధారణ పాము కాదు.. తనకంటూ ప్రత్యేకంగా ఒక ఎకోసిస్టమ్ రోల్ ఏర్పాటు చేసుకున్న స్పెషలైజ్డ్ ప్రెడేటర్.
పాములే కింగ్ కోబ్రా ఆహారం
చాలా పాములు ఎలుకలు, బల్లులు, పక్షులు వంటివాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. తద్వారా అవి ప్రకృతిలో ఇటువంటి జీవుల సంఖ్యను సమతుల్యం చేస్తూ ఉంటాయి. కానీ.. కింగ్ కోబ్రా ప్రత్యేకత ఏంటంటే.. ప్రధానంగా పాములే దాని ఆహారం. విషరహితాలే కాదు.. విషపూరితమైన పాములను, ఆఖరుకు తన జాతిలోని పాములను సైతం ఆహారం తీసుకుంటుంది కింగ్ కోబ్రా. ఈ ఆలవాటు కారణంగా కింగ్ కోబ్రాకు ఇతర మృగాలతో పోటీ పడాల్సిన అవసరం ఉండదని కాన్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘Reptiles & Amphibians‘ పత్రికలో ప్రచురితమైన –”వైల్డ్ కింగ్ కోబ్రాపై పరిశీలనలు: ఆహార అన్వేషణ, ఆహారంపై ప్రత్యేక దృష్టితో” అనే పత్రం పేర్కొంటున్నది.
దాని సైజ్ కూడా కలిసొచ్చే అంశమే..
నిజానికి కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము. సుమారు ఐదు మీటర్ల వరకూ పెరుగుతుంది. పెద్ద పెద్ద, ప్రమాదకర ఆహారాలను వేటాడే సమయంలో ఈ పరిమాణం.. కింగ్‌కోబ్రాకు చాలా కలిసొచ్చే అంశం. మరో ప్రత్యేకత ఏంటంటే.. కింగ్ కోబ్రా.. తన శరీరంలో ఎక్కువ భాగాన్ని పైకి లేపగలదు.. అది వేటలో ప్రత్యేక అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఆత్మరక్షణకు, లేదా ముందస్తు దాడికి వీలు కల్పిస్తుంది. ఎందుకంటే.. కింగ్ కోబ్రా వేటాడే పాములు దానికంటే చిన్నగా ఉండే కారణంగా ఇది పై నుంచి దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది. బ్రీడింగ్ సీజన్‌లో కింగ్ కోబ్రాల కొట్లాట ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సమయంలో ఆధిపత్యం కోసం కింగ్ కోబ్రాలు పోట్లాడుకుంటాయి. విచిత్రం ఏమంటే.. ఆ సమయంలో అవి కాటు వేయడం వంటివి చేయడకుండా.. కుస్తీ పోటీ తరహాలో ఒకదాన్ని మరొకటి నెట్టేసుకుంటాయిట.
Nature’s deadliest liquid! 💀 The shocking scene of King Cobra venom extraction pic.twitter.com/MBWaUF2KON
— Nature Chapter (@NatureChapter) February 8, 2026
ప్రాంతాలను బట్టి విష తీవ్రత
కింగ్ కోబ్రా శక్తిమంతమైనదే కాకుండా.. ఎలాంటి వాతావరణంలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. కింగ్ కోబ్రాల విషం.. ప్రాంతాలు, అందుబాటులో ఉండే ఆహారాన్ని అనుసరించి మారుతూ ఉంటుందని Journal of Proteomicsలో ప్రచురితమైన వ్యాసం పేర్కొంటున్నది. ఈ విషంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయని తెలిపింది.
ప్రవర్తనలోనూ డిఫరెంటే…
కింగ్ కోబ్రాలు ప్రధానంగా ఏకాంతజీవులు. తమ జాతి పాములు అయినప్పటికీ కలిసి జీవించడానికి పెద్దగా ఆసక్తి చూపవు. దీనికి ప్రధాన కారణం.. వాటి ఆహార అలవాట్లే. కింగ్ కోబ్రా ప్రధానంగా ఇతర పాములను తింటుంది. పాములు ప్రతి చోటా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే అవి ఆహారాన్ని వేటాడుతూ ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి.
బహుదూరపు బాటసారులు..
కింగ్ కోబ్రాలు ఆహార వేటలో దీర్ఘకాలం ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాని కారణంగానే అవి ఇతర పాముల కంటే మరింత చురుకుగా ఉంటాయి. అందుకే ఎలాంటి వాతావరణంలోనైనా.. అడవులు, పచ్చికబయళ్లు, చిత్తడి నేలల్లో ఇవి ఇమిడిపోగలవు.
గుడ్లు పొదిగేందుకు గూడు కడతాయి..
పాముల్లో ఏ జాతిలోనూ లేని ప్రత్యేక లక్షణం కింగ్ కోబ్రాల్లో కనిపిస్తుంది. ఇవి ఆకులు, పుల్లలతో గూడు కట్టి.. గుడ్లను కాపాడుకుంటాయి. ఈ విద్య తెలిసిన ఏకైక పాము కింగ్ కోబ్రా. ఆ గూడులో ఆడ కింగ్ కోబ్రా వారాల పాటు ఆ గుడ్లను శత్రువు నుంచి కాపాడుకుంటుంది. ఇలా గుడ్లను కాపాడే పాము కూడా మరోటి లేదు. చాలా రకాల పాములు గుడ్లను పెట్టేసి వెళ్లిపోతాయి. కానీ.. పేరెంటల్ కేర్ చూపించే అరుదైన జాతి కింగ్ కోబ్రా.
మొత్తంగా చూస్తే.. పాములను ఆహారంగా తీసుకోవడం, భారీ పొడవు, అడాప్టివ్ వెనం, ఒంటరి జీవనం, గూడు నిర్మాణం.. ఇవన్నీ కలిపి దీన్ని ఒక ప్రత్యేకమైన ప్రిడేటర్‌గా మార్చాయి. అందుకే ఇది పాములు రాజుగా నిలిచింది.
మనుషులతో ఘర్షణ
పాముల సహజ ఆవాసాలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. పంట పొలాలు.. రియల్ ఎస్టేట్ వెంచర్లు అవుతున్నాయి. అడవులు నరికివేతకు గురవుతున్నాయి. చిత్తడి నేలలు మాయమైపోతున్నాయి. ఈ క్రమంలో పాములు మానవ ఆవాసాల్లోకి వస్తున్నాయి. వాస్తవానికి ఏ పాము కూడా మనుషులను ఆహారం కోసం వేటాడవు. కాటు వేయవు. పాములు భయపడితే.. ఆత్మరక్షణ కోసం మాత్రమే కాటు వేస్తాయి. పాములు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిలో పంటలను పాడు చేసే క్రిమికీటకాలు, ఎలుకల వంటివాటిని తింటూ సమతుల్యాన్ని కాపాడుతుంటాయి. కాబట్టి.. పాములు కనిపించినప్పుడు వాటిని చంపడం కంటే.. సురక్షితంగా వాటి దారిని వాటిని పోనివ్వడం ఉత్తమం. మీకు ఇంకా ఆసక్తి ఉంటే.. పాములను రక్షించేవారిని పిలిచి.. ఆ పాములను సురక్షితంగా పట్టి.. అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టేవారికి సమాచారం ఇవ్వడం వాటికి మరింత మేలు చేస్తుంది.
కింగ్ కోబ్రాల అలవాట్లు, ప్రవర్తన వీడియోలు ఇక్కడ చూడండి..
Did you know the king cobra is ophiophagous, meaning it specializes in eating other snakes, including venomous ones like cobras and kraits?
[📹 thereptilezoo]pic.twitter.com/5YHwyeCelu
— Massimo (@Rainmaker1973) March 1, 2026
A king Cobra snake 🐍 that can grow up to 18 feet(5.4 mtrs) can lift a third of its body.
Credit 📹 by unknown pic.twitter.com/95CZGuXgd2
— Domenico (@AvatarDomy) March 1, 2023
This is the KING COBRA: the largest venomous snake in the world. pic.twitter.com/UxVOTaRSWQ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 12, 2025
ఇవి చదివారా?
Snakes Unique Trick | ఈ పాముల తెలివి మామూలుగా లేదుగా… వీడియో చూడండి..
Anaconda Video | అనకొండ, కొండచిలువ మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి? వాటి బలాబలాలేంటి?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram