King Cobra : మన్యం జిల్లాలో 16 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్
పార్వతీపురం మన్యం జిల్లాలో 16 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్… స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచారు.

King Cobra | అమరావతి : పార్వతీపురం మన్యం జిల్లాలో కింక్ కోబ్రా(గిరి నాగు) హల్చల్ చేసింది. బుధవారం ఉదయం కాలకృత్యాల కోసం ఓ ఇంటి యజమాని తన వాష్ రూమ్ లోకి వెళ్లగా 16 గిరినాగును చూసి భయాందోళనకు గురై ఒక్క ఉదుటున వెనక్కి వచ్చేశాడు. కింగ్ కోబ్రా సమాచారాన్ని వెంటనే స్నేక్ క్యాచర్స్ కు అందించాడు. సమాచారం అందుకున్న ఇద్దరు స్నేక్ క్యాచర్స్ సంఘటన స్థలానికి చేరుకుని చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకుని సంచిలో బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆ భారీ గిరినాగును దూరాన ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు.
పార్వతీ పురం మన్యం జిల్లాలో శంకరం రిజర్వ్ ల్యాండ్(కాశీపురం బీట్, జీవనాబాద్ రేంజ్ పాడేరు డివిజన్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి కింగ్ కోబ్రా అభయారణ్యం ఏర్పాటుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గిరి నాగులు రక్షణకు స్థానిక గిరిజన సంఘాలతో కలిసి అటవీ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా గిరినాగుల గుడ్లను సంరక్షించి 30పిల్లలను ఇటీవలే అడవిలో వదిలారు.
ఇవి కూడా చదవండి…
బీజేపీలో చేరనున్న పైలెట్ రోహిత్ రెడ్డి…?
iPhone 17 సిరీస్ సెప్టెంబర్‌లో ఆవిష్కరణ – GPT-5 కలయికతో విప్లవం