Elephants Herd Swimming : తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!
అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది
విధాత : ప్రకృతి అద్బుతం దృశ్యానికి అస్సాం రాష్ట్రం బ్రహ్మపుత్ర నది వేదికైంది. అస్సాం రాష్ట్రం ఏనుగుల జనాభాకు ఆలవాలం అన్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మపుత్ర నదిలో ఓకేసారి వంద ఏనుగులు బ్రహ్మపుత్ర నదిని దాటుతున్న వీడియో వైరల్ గా మారింది. ఇది ప్రకృతి ఆవిష్కరించిన అత్యద్భుత ఊరేగింపు అని ఫారెస్టు అధికారులు అభివర్ణించారు. ఒకేసారి వంద ఏనుగుల గుంపు బ్రహ్మపుత్ర నదిలో పరిపూర్ణ విన్యాసంతో ఈదుతు వెలుతున్న దృశ్యాలు చూడటం కనువిందుగా కనిపించింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..అది చూసిన నెటిజన్లు వాహ్వ్ అద్బుతం అంటూ అశ్చర్యానందాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఏనుగుల గుంపు నది దాటుతున్న దృశ్యాన్ని డ్రోన్ కెమెరాలో చిత్రీకరించబడగా..పై నుంచి చూస్తే ఏనుగుల గుంపు తాబేళ్లు మాదిరిగా చిన్నగా కనిపించడం విశేషం.
A large elephant herd of about 100 was seen swimming across the Brahmaputra River in Assam, India, navigating the waters at Nimati Ghat, a major river port pic.twitter.com/kcXVGGBz9q
— Nature Unedited (@NatureUnedited) March 20, 2026
ఇవి కూడా చదవండి :
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు : కేటీఆర్
Dhurandhar 2 | ‘ధురంధర్ 2’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram