మనుగడ కోసం పోరాటం. ఏ జీవికైనా తప్పదు. ప్రకృతిలో ఇది న్యాయం కూడా. ఒక జీవి బతకాలంటే వేటలో మరో జీవి అంతమొందాల్సిందే. ఈ వేటలో తరిమేది ఒకటి. తప్పించుకునేది మరొకటి. ఆహారాన్ని త్వరగా అందుకోవాలని కొన్ని ఎగబడితే.. వాటి నుంచి తప్పించుకునేందుకు మరో జీవి ఆపసోపాలు పడుతుంది. అది చిన్న జీవి అయితే ఆ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఇలాంటి సమస్య ఒక కుందేలకు వస్తే ఎలా ఉంటుంది? ఇదే కాన్సెప్ట్‌తో ఏఐని ఉపయోగించి తయారు చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నది. ప్రతి పామును తప్పించుకునేందుకు కుందేలు పడే ఆరాటం హృద్యంగా ఉంటుంది. ఈ వీడియో సుమారు 8 నిమిషాలు ఉంటుంది. పూర్తిగా చూడటం మర్చిపోకండి.. ఎందుకంటే.. చివరిలోనే అనూహ్యమైన మలుపు ఉంటుంది.
ఇక వీడియో విషయానికి వస్తే.. పాములు కొండల్లోని బొరియల్లో దాగి ఉంటుంటాయి. ఒక కుందేలు.. గద్దను తప్పించుకునే క్రమంలో ఈ కొండల్లోకి ప్రవేశిస్తుంది. అప్పటికి గద్ద నుంచి ప్రమాదం తొలగిపోయినా.. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. ఆ బండరాళ్ల చీలికల మధ్య ఎటు చూసినా పాములే. ఒక్కసారిగా బొరియల్లో నుంచి అనేక పాములు బయటకు వస్తాయి. అడుగు తీసి అడుగేస్తే పాము ఎదురవుతుంది. పక్క నుంచి ఒకటి.. పై నుంచి మరోటి.. బుస కొడుతూ ఆ కుందేలును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ.. అన్ని పాముల దాడుల నుంచి కుందేలు తప్పించుకుంటూ.. పరుగులు తీస్తూ ఉంటుంది. చివరిలో ట్వస్ట్ ఉంది.. అది మీరే చూడండి..
కొండ చరియల్లో రక్త పింజరలు ఎలా మాటు వేసి ఉంటాయో.. కుందేలు ఎంత వేగంతో వాటిని తప్పించుకోవాల్సి వస్తుందో.. తన మనుగడ కోసం ఎంత పోరాటం చేయాల్సి వస్తుందో.. ప్రతి సీన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది.. ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం ఎంత క్లిష్టమైనదో అర్థమవుతుంది. మరింకేంటి ఆలస్యం.. ఆ వీడియో చూసేయండి..
Read Also |
కింగ్ కోబ్రాలు నాలుగు జాతులా? మెడికల్ పజిల్‌కు పరిష్కారం దొరికిందా?
కాళేశ్వరం ఇంజినీర్లను… తప్పించారా? పైరవీలతో తప్పించుకున్నారా?
