King Cobra | వామ్మో.. పాము నీళ్లు ఎలా తాగుతుందో చూడండి!
కింగ్ కోబ్రాలు అత్యంత భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ.. వాటి ఆవాసాలను కోల్పోతున్న, ముప్పును ఎదుర్కొంటున్న జాతిగా ఐయూసీఎన్ రిడ్ లిస్ట్‌లో చేరాయి. ఇలా కింగ్ కోబ్రాలను ప్రత్యేక కేంద్రాల్లో సంరక్షించాల్సి వస్తున్న తీరు.. అవి నానాటికీ కోల్పోతున్న ఆవాసాలను ప్రస్తావనకు తెస్తున్నది.

King Cobra | ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పాల్లో కింగ్ కోబ్రా అగ్రస్థానంలో ఉంటుంది. దాని అత్యంత ప్రమాదకరమైన న్యూరోటాక్సిక్ విషం, భయం గొలిప ప్రవర్తన కింగ్ కోబ్రాల సొంతం. ఒక శాంక్చురీలో రక్షణ పొందుతున్న కింగ్ కోబ్రాకు ఒక ఊహించని స్నేహితుడు దాహం తీర్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దాహం తీర్చింది ఎవరో కాదు.. ఒక నీటిని వెదజల్లే స్ప్రింక్లర్. ఒక చిత్రం వెయ్యి పదాలను చెబుతుందనే రీతిలోనే ఈ వీడియో సైతం అనేక అంశాలను మదిలో మెదిలేలా చేస్తున్నది.
బుసలు కొడుతూ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక కింగ్ కోబ్రాను స్నేక్ హ్యాండ్లర్ ఒకరు స్ప్రింక్లర్‌ను ఉపయోగించి.. శాంతపర్చడమే కాకుండా.. దాని దాహం తీర్చిన తీరు.. నెటిజన్ల ప్రశంసలందుకున్నది. దూసుకొస్తున్న కోబ్రాను స్నేక్‌హ్యాండ్లర్.. హే బడ్డీ.. నైస్.. అండ్ ఫ్రెండ్లీ.. అంటూ జాగ్రత్తగా డీల్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. స్ప్రింక్లర్ నుంచి నీటి జల్లు పడుతుంటే సర్పరాజం శాంతిస్తుంది. పాముల అగ్రెసివ్ బిహేవియర్‌ను మేనేజ్ చేసేందుకు నిపుణులు ఈ టెక్నిక్‌ను వాడుతుంటారు. ఈ సమయంలో వారు చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే.. ఒక్క కాటుతో వెలువడే విషం.. ఒక ఏనుగును లేదా 20 మంది మనుషులను చంపగలదు.
స్నేక్‌హ్యాండ్లర్‌తో కింగ్ కోబ్రా ఘర్షణ.. మానవులకు, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములకు మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను నొక్కి చెబుతున్నది. కింగ్ కోబ్రాలు అత్యంత భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ.. వాటి ఆవాసాలను కోల్పోతున్న, ముప్పును ఎదుర్కొంటున్న జాతిగా ఐయూసీఎన్ రిడ్ లిస్ట్‌లో చేరాయి. ఇలా కింగ్ కోబ్రాలను ప్రత్యేక కేంద్రాల్లో సంరక్షించాల్సి వస్తున్న తీరు.. అవి నానాటికీ కోల్పోతున్న ఆవాసాలను ప్రస్తావనకు తెస్తున్నది. వాటితో ఎంత నైపుణ్యంతో వ్యవహరించాలనేదే కాకుండా.. పర్యావరణ సంబంధ అంశాలను కూడా చర్చ చేస్తున్నది. పర్యావరణ సమతుల్యంలో గణనీయమైన మార్పులు, నానాటికీ తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న, విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. మెరుపు వరదలు, వాటి ఆవాసాల విధ్వంసం కారణంగా ఈ సర్పరాజాలు మానవ ఆవాసాలకు సమీపంగా వస్తుండటం సాధారణంగా మారిపోయింది. మొత్తంగా ఈ వీడియో సర్పాలను హ్యాండిల్ చేసే సమయంలో భద్రత, వాటిని సంరక్షించేందుకు చేయాల్సిన కృషిని ఈ వీడియో చాటి చెబుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూసేయండి ఆ వీడియోను…
ఇవి కూడా చదవండి..
Srisailam Dam | డేంజర్‌లో శ్రీశైలం డ్యామ్?
Maleriraptor kuttyi | తెలంగాణలో జీవించిన.. డైనోసార్ మలేరిరాప్టర్ కుట్టి గురించి మీకు తెలుసా?