Viral News | మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారు? మన అదృష్టం ఇంతే ఉందని అనుకుంటాం. లేదంటే మనకు జాబ్ ఇవ్వని కంపెనీని తిట్టుకుంటాం. ఇలా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా తనను సెలెక్ట్ చేయకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన ఓ యువకుడు.. సదరు కంపెనీలపై తాంత్రిక పూజలు చేయించాడు. అంతేకాదు దాన్ని తన సోషల్‌మీడియా ఖాతాలో కూడా పోస్టు చేశాడు. ఇది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
హాంకాంగ్‌లో పర్యటిస్తున్న సమయంలో షో దివాన్ అనే ట్రావెలర్ ఈ వింత పనిచేశాడు. తనకు జాబ్ ఇవ్వని కంపెనీలకు సరదాగా క్షుద్రపూజల ద్వారా శాపనార్థాలు పెట్టించాడు. దీనికోసం 5 డాలర్లు( మన కరెన్సీలో దాదాపు రూ.470) రూపాయలను ఖర్చు కూడా చేశాడు. ఈ ఘటన వినడానికి నవ్వొస్తున్నప్పటికీ.. సోషల్‌మీడియాలో మాత్రం ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసిన నాలుగు రోజుల్లోనే 6.1 మిలియన్ వ్యూస్ దాటింది.
హాంకాంగ్‌లో ట్రెండింగ్ సంప్రదాయం
హాంకాంగ్ కాస్‌వే బేలోని కెనాల్ రోడ్ వెస్ట్ ట్రామ్ స్టాప్ సమీపంలోవిలన్ హిట్టింగ్ అనే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ పద్ధతిలో స్థానికంగా ‘దా సియు యాన్(ఆంటీలు)’గా పిలవబడే ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మనకు నచ్చని వ్యక్తుల గురించి చెబితే కొద్ది మొత్తంలో డబ్బులు తీసుకుని వారిని శపిస్తారు. దీని ద్వారా మన ఇబ్బందులు, దురదృష్టం తొలగిపోతుందని చాలామంది విశ్వసిస్తారు.
నచ్చని వాళ్ల పేరు చెబితే శపిస్తారు!
ఈ ప్రక్రియలో భాగంగా మనకు ఇబ్బంది కలిగించే వ్యక్తి పేరును ఓ కాగితపు బొమ్మపై రాస్తారు. దాని ముందు అగరబత్తులు వెలిగించి దేవుడిని ప్రార్థిస్తారు. ఆ తర్వాత కాగితపు బొమ్మను చెప్పుతో పదే పదే కొడతారు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతారు. అయితే ప్రముఖ ట్రావెలర్ షో దేవాన్ ఇటీవల అక్కడకు వెళ్లాడు. ఎలాగూ వెళ్లాం కదా అని సరదాగా తనకు ఉద్యోగం ఇవ్వని కంపెనీల పేర్లను చెప్పి.. శాపనార్థాలు పెట్టించాడు. ఇందుకోసం ఆ ఆంటీలకు 5 డాలర్లు చెల్లించాడు. ఇలా శాపం పెట్టించే ప్రక్రియను వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
మూఢనమ్మకమే కానీ..!
జాబ్ మార్కెట్ చాలా కష్టంగా ఉంది. అందుకే నన్ను పట్టించుకోని కంపెనీలు అన్నింటినీ శపించానని షో దేవాన్ ఆ వీడియోలో తెలిపాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తమకు కూడా అలాగే చేయాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. తనను రిజెక్ట్ చేసిన కంపెనీల లిస్ట్ 300 వరకు ఉందని.. తాను కూడా అక్కడకు ఒకసారి వెళ్లాల్సిందేనని కామెంట్ పెట్టాడు. ఆన్‌లైన్‌లో శపించే ఆప్షన్ ఏమైనా ఉందా అని మరొకరు సరదాగా ప్రశ్నించారు. అయితే ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే అయినప్టపిటకీ.. మన మనసులోని ఒత్తిడిని, కోపాన్ని బయటకు పంపించేందుకు ఒక చక్కటి మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More:
పాములకు పేర్లు పెట్టడం అంత ‘వీజీ’ కాదు.. సుదీర్ఘ ప్రక్రియ తెలిస్తే షాకే
ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్‌లో వైరల్‌గా మారిన మికామి ఆలయం
